iDreamPost
android-app
ios-app

జనసేనలో ముదురుతోన్న నాదెండ్ల వర్సెస్‌ నాగబాబు?

  • Published Oct 28, 2023 | 5:01 PM Updated Updated Oct 28, 2023 | 5:01 PM

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. సీనియర్‌ నేతలు, కొత్తగా వచ్చిన కొందరి టార్చర్‌ తట్టుకోలేక ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో సందీప్‌ రాయల్‌ జనసేన నుంచి బయటకు రావడమే కాక.. సంచలన వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వివరాలు..

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. సీనియర్‌ నేతలు, కొత్తగా వచ్చిన కొందరి టార్చర్‌ తట్టుకోలేక ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో సందీప్‌ రాయల్‌ జనసేన నుంచి బయటకు రావడమే కాక.. సంచలన వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వివరాలు..

  • Published Oct 28, 2023 | 5:01 PMUpdated Oct 28, 2023 | 5:01 PM
జనసేనలో ముదురుతోన్న నాదెండ్ల వర్సెస్‌ నాగబాబు?

జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే దశాబ్దంపైగానే అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీ, దాని అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్ర రాజకీయంగా ఏమాత్రం పరిణీతి సాధించలేదనే అభిప్రాయం జనాల్లో ఉంది. పార్టీలో కీలక నేతలేవరో కనీసం జనసైనికులకు కూడా సరిగా తెలియదు. ఇక జనసేన అనగానే పవన్‌ కళ్యాణ్‌ తర్వాత అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది నాదెండ్ల మనోహర్‌, మరొకరు పవన్‌ సోదరుడు నాగబాబు. వీళ్ల తర్వాత పార్టీలో కీలక నేతలు ఎవరు అన్నది.. సామాన్యులకే కాక.. ఆ పార్టీ నేతలకు కూడా సరిగా తెలియదు.

ఇక త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. ఎన్నికల సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం జనసేనను అసంతృప్తులు కుదిపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌.. కొత్తగా వచ్చిన రుక్మిణి కోట కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం పార్టీకి రాజీనామా చేసిన పసుపులేటి పద్మావతి.. రుక్మిణి కోట ఎలా ఇబ్బంది పెట్టిందో వివరించారు.

సంచలనంగా మారిన వీడియో..

ఇక తాజాగా సందీప్‌ రాయల్‌ కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేనలో ఎలాంటి పరిస్థితులున్నాయో వివరిస్తూ.. ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌​ మీడియాలో వైరలవుతోంది. అంతేకాక పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్‌కి పార్టీ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని సందీప్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాక పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబుపై.. నాదెండ్ల మనోహర్‌కి ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చాడు. నాగబాబు రాజకీయాలకు పనికిరాడని ఒకానొక సందర్భంలో నాదెండ్ల అన్నారని సందీప్‌ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది.

అంతేకాక నాగబాబుకి కనీసం పార్టీ కెమరామెన్‌ను కూడా పంపరంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇక నాదెండ్ల తీరు నచ్చకనే నాగబాబు.. ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. రుక్మిణి కోట అనే మహిళ వచ్చిన తర్వాత పార్టీలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయని.. పవన్‌కి ఆమె తప్ప ఎవరూ దగ్గర కాకుడదనే ఉద్దేశంతోనే పార్టీ కోసం శ్రమిస్తున్న తమలాంటి వారిని బయటకు పంపేలా చేస్తున్నారని సందీప్‌ ఆరోపించాడు.

నాదెండ్ల తీరుపై అసంతృప్తి..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. జనసేన అంతర్గత వ్యవహారలు బయటకు రావడం సంచలనంగా మారింది. నాగబాబు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు.. అందుకు కారణం ఏంటో ఇప్పిడిప్పుడే అర్థం అవుతోంది అంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇక నాదెండ్ల మనోహర్‌ తీరు మీద జనసేన పార్టీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. ఆయన పార్టీని నాశనం చేయడానికే ఒక వ్యూహం ప్రకారం పవన్‌ను తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.

అయితే నాదెండ్ల మనోహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం గ్రహించిన పవన్‌ దీని గురించి పార్టీ నేతలకు, కార్యకర్తలకు బహిరంగంగానే వార్నింగ్‌ ఇచ్చారు. నాదెండ్లకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని హెచ్చరించారు. అన్నట్లే కొందరిని బయటకు పంపారు కూడా. ఇక తాజాగా సందీప్‌ రాయల కూడా నాదెండ్ల మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి జనసేనలో మొదలైన నాగబాబు వర్సెస్‌ నాదెండ్ల వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి అంటున్నారు జనాలు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin