Swetha
చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని కథలను.. అలాగే చరిత్ర నుంచి భవిష్యత్ తరాలు తెలుసుకోవలసిన కొన్ని కథలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఇతిహాస పురాణాల గురించి పక్కన పెడితే. కొన్ని వివాదాస్పదమైన అంశాలను కూడా తెరపైకి తీసుకుని వస్తున్నారు.
చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని కథలను.. అలాగే చరిత్ర నుంచి భవిష్యత్ తరాలు తెలుసుకోవలసిన కొన్ని కథలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఇతిహాస పురాణాల గురించి పక్కన పెడితే. కొన్ని వివాదాస్పదమైన అంశాలను కూడా తెరపైకి తీసుకుని వస్తున్నారు.
Swetha
చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని కథలను.. అలాగే చరిత్ర నుంచి భవిష్యత్ తరాలు తెలుసుకోవలసిన కొన్ని కథలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఇతిహాస పురాణాల గురించి పక్కన పెడితే. కొన్ని వివాదాస్పదమైన అంశాలను కూడా తెరపైకి తీసుకుని వస్తున్నారు. ఉదాహరణకు కాశ్మిరీ ఫైల్స్ , కేరళ స్టోరీ , బెంగాల్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాయో తెలియనిది కాదు. వీటిపై విమర్శలు వెల్లువెత్తిన మాట నిజమే. అయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ తరహా కథలకు మంచి క్రేజ్ ఉంటుంది.
ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ తాజ్ మహల్ చరిత్రను తవ్వుతుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి ఇప్పటివరకు ఎన్నో కథలు కథలను అంతా వినే ఉంటారు. కానీ ఎవరికీ తెలియని కొన్ని సత్యాలను తెలియజేసే సినిమాగా దీనిని రూపొందిస్తున్నారట బాలీవుడ్ టీం. దీనిలో లెజెండరీ యాక్టర్ పరేష్ రావల్ లీడ్ రోల్ లో నటించారట. ఈ సినిమా పేరు ‘ది తాజ్ స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు.
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటని.. ఇది కొందరికి సమాధి అయితే ఇంకొందరికి మందిరమని.. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దీని గురించి మీకేం తెలుసు అనే ప్రశ్నలతో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తే ఆసక్తికరంగానే అనిపించింది. ప్రసిద్ధి చెందిన ప్రతి దానివెనుక ఎన్నో తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. కానీ కాలగర్బంలో అవన్నీ మరుగున పడిపోతూ ఉంటాయి. సో తాజ్ మహల్ వెనుక ఎలాంటి కథ ఉందో.. తెలియాలంటే అక్టోబర్ 31 వెండితెరమీద చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.