Swetha
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ పోటాపోటీగా జరిగాయి. దివ్య, భరణి , కళ్యాణ్ , రాము , ఇమాన్యుయేల్ తప్ప మిగిలిన వారంతా కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈరోజు జరగబోయే గేమ్ ఇంకా ఎవరు సేవ్ అవుతారు అనేది చూడాలి. అయితే గత సీజన్స్ లో కాకుండా ఈ సీజన్ లో కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ అధికారులు
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ పోటాపోటీగా జరిగాయి. దివ్య, భరణి , కళ్యాణ్ , రాము , ఇమాన్యుయేల్ తప్ప మిగిలిన వారంతా కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈరోజు జరగబోయే గేమ్ ఇంకా ఎవరు సేవ్ అవుతారు అనేది చూడాలి. అయితే గత సీజన్స్ లో కాకుండా ఈ సీజన్ లో కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ అధికారులు
Swetha
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ పోటాపోటీగా జరిగాయి. దివ్య, భరణి , కళ్యాణ్ , రాము , ఇమాన్యుయేల్ తప్ప మిగిలిన వారంతా కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈరోజు జరగబోయే గేమ్ ఇంకా ఎవరు సేవ్ అవుతారు అనేది చూడాలి. అయితే గత సీజన్స్ లో కాకుండా ఈ సీజన్ లో కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ అధికారులు. ఆల్రెడీ రెండు వారాల క్రితం ఓ కామానర్ ను హౌస్ లోకి పంపించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒకేసారి 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
మొన్నటివరకు వాళ్ళు వీళ్ళు అనే చాలానే పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ముందుగా ఈ సీజన్ లో సీరియల్ యాక్టర్ ఇషా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా సీరియల్స్ లోతో పాటు కొన్ని ఈవెంట్స్ లో కనిపిస్తుంది. ఈమె ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ సీజన్ 6 లో 9 వారాల పాటు ఉన్నట్లు టాక్. సో ఓ రకంగా ఈమె హౌస్ లో టఫ్ కాంపిటీషన్ అని చెప్పాల్సిందే. నెక్స్ట్ ఆర్టిస్ట్ సాయి శ్రీనివాస్.. గోల్కొండ హై స్కూల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఇతను హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీగా రానున్నాడు. అలాగే సీరియల్ యాక్టర్ గౌరవ్ గుప్తా కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
వీరంతా ఒకెత్తయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే ఇద్దరు మరొక ఎత్తు. సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అయినా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య , అలాగే దివ్వెల మాధురి. ఇద్దరు వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ వారం నుంచి బిగ్ బాస్ హౌస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారబోతుందని చెప్పొచ్చు. దానికి ముందు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది కూడా సస్పెన్స్ ఏ. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.