iDreamPost
android-app
ios-app

అంతన్నాడింతన్నాడో పవన్ బాబు…

అంతన్నాడింతన్నాడో పవన్ బాబు…

అంతన్నాడింతన్నాడో పవన్ బాబు….!!!
ఢిల్లీ ఎల్లి సల్లగైపోనాడో పవన్ బాబు ..

సోమరిపోతుకు సోకులెక్కువ …పని రానివాడికి మాటలెక్కువ అన్న సామెత జనసేన అధినేత పవర్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తాను లేస్తే మనిషిని కాను. తాట తీస్తా..తెగిస్తే పీక కోస్తా లేదా తలా తెగేసుకుంటా అంటూ నిమిషానికోతీరుగా మాట్లాడే పవన్ కు తాజాగా జ్ఞాన నేత్రం తెరుచుకున్నట్లుంది.

అమరావతిని ఎవరు కదిలిస్తారో చూస్తా..అంగుళం కదిల్చినా కాటమారాయుడి కత్తికి పని చెప్తా అనే పవన్ కళ్యాణ్ కు తాజాగా బీజేపీతో పొత్తు కుదిరింది. గతంలో నేరుగా మోడీ, గవర్నర్ పక్కన కూర్చునే స్థాయిలో ఉన్న పవన్ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో మొన్నటి ఆయన పొత్తు మీటింగులో అమిత్ షా,మోడీ ఎవరూ లేకుండా కేవలం జేపీ నడ్డాతో కానిచ్చేశారు. ఆ తరువాత కూడా పవన్ ఏపీ ప్రభుత్వం పై ఒంటికాలిమీద లేచి తనకు తోచింది మాట్లాడేవారు.

అమరావతి కేవలం చంద్రబాబు కోసమే అని గతంలో ప్రకటనలు చేసిన పవన్ ఆ తరువాత చంద్రబాబుతో సర్దుకుపోయారు. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని కూడా అమరావతి విషయంలో విమర్శించారు.రాజధానిగా అమరావతి ఉండాలని,విశాఖకు మారిస్తే యథావిధిగా తాట తీస్తానని అన్నారు.

మొత్తానికి నిన్న ఢిల్లీ వెళ్లి నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి తో కలిసి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు.ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రాజధానులకు, కేంద్రానికి సంబంధం లేదని, ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పుకొచ్చారు. అయితే రాజధాని మార్పునకు కేంద్రం సమ్మతి ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని అయితే అలాంటిదేమి లేదని,అసలు ఇందులో కేంద్రం ఇన్వాల్ఫ్మెంట్ లేదని అన్నారు.

అవునయ్యా..నరుకుతా.. పోగులు పెడతా అన్నావు .మరి ఇలా మాట మార్చేశావు ఏమిటీ అంటే “మాటలది ఏముందీ..ఎన్నైనా అనొచ్చు…ఢిల్లీ వెళ్ళాక అసలు నా పవర్ ఏమిటన్నది అసలు సంగతి తెలిసింది” అని పవన్ తన అంతరంగికులతో చెప్పారని తెలిసింది.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş