iDreamPost
android-app
ios-app

దీపావళి రేస్ లో ముందుండేది ఎవరు ?

  • Published Oct 10, 2025 | 11:00 AM Updated Updated Oct 10, 2025 | 11:00 AM

కొన్ని నెలలుగా ముభావంగా సాగిపోతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఆశలు చూపించింది సెప్టెంబర్. సెప్టెంబర్ రిలీజ్ అయినా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే అక్టోబర్ కు కూడా కాంతారా చాప్టర్ 1 తో మంచి స్టార్ట్ దొరికింది. ఇక ఈ వారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

కొన్ని నెలలుగా ముభావంగా సాగిపోతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఆశలు చూపించింది సెప్టెంబర్. సెప్టెంబర్ రిలీజ్ అయినా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే అక్టోబర్ కు కూడా కాంతారా చాప్టర్ 1 తో మంచి స్టార్ట్ దొరికింది. ఇక ఈ వారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

  • Published Oct 10, 2025 | 11:00 AMUpdated Oct 10, 2025 | 11:00 AM
దీపావళి రేస్ లో ముందుండేది ఎవరు ?

కొన్ని నెలలుగా ముభావంగా సాగిపోతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఆశలు చూపించింది సెప్టెంబర్. సెప్టెంబర్ రిలీజ్ అయినా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే అక్టోబర్ కు కూడా కాంతారా చాప్టర్ 1 తో మంచి స్టార్ట్ దొరికింది. ఇక ఈ వారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత దీపావళి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి చాలానే సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సమయంలో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

అక్టోబర్ 16న మిత్రమండలితో ఈ సందడి మొదలుకానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నవ్వులు పూయిస్తూనే ఉంది. దీనికి మంచి ఓపెనింగ్స్ ఏ రావొచ్చు. ఇక ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్ 17 న ‘తెలుసు కదా’ , ‘డూడ్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న డూడ్ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే రెస్పాన్స్ బాగా వస్తుంది. యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ నుంచి వస్తున్నా తెలుసుకదా కూడా ఇలాంటి పాజిటివ్ ఒపీనియన్ ఏ కనిపిస్తుంది.

ఈ రెండు సినిమాలకు మొదటి రోజే హౌస్ ఫుల్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఆ తర్వాత 18 న కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా బాగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. కొన్ని వివాదాలకు కూడా దారి తీస్తుంది. ఇలా ఎలా చూసుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ లో రిజిస్టర్ అయింది. సో ఈ దీపావళి రేస్ లో ఏది ముందు ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.