iDreamPost
android-app
ios-app

నాదెండ్లకు నిరసన సెగ.. తణుకు జనసైనికుల దాడి యత్నం!

  • Published Feb 26, 2024 | 9:27 PM Updated Updated Feb 26, 2024 | 10:03 PM

Attempt to Attack Nadendla Manohar: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. తాడేపల్లి గూడెంలో తాజాగా జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై ఆపార్టీ నేతలు దాడికి యత్నించడం సంచలనంగా మారింది.

Attempt to Attack Nadendla Manohar: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. తాడేపల్లి గూడెంలో తాజాగా జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై ఆపార్టీ నేతలు దాడికి యత్నించడం సంచలనంగా మారింది.

నాదెండ్లకు నిరసన సెగ.. తణుకు జనసైనికుల దాడి యత్నం!

టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ప్రధానంగా జనసేనకు సంబంధించి తొలిజాబితాలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై తాడేపల్లి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ రోజు కూడా సీటు ఇస్తారన్న విషయంపై అధినేతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాడేపల్లిలో పర్యటన నిమిత్తం నాదేళ్ల మనోహర్ వచ్చారు. అదే సమయంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ రామచంద్ర రావు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి. తాడేపల్లి నియోజకవర్గానికి వచ్చిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై జనసేన కార్యకర్తలు దాడి చేయడానికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో జనసేన పెద్ద ఏత్తున ప్రభావం చూపిస్తుందని… ఇటీవల వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాన్ తెగ ప్రచారం చేశారు. తీరా సీట్ల కేటాయింపు విషయంలో అన్యాయానికి పాల్పపడ్డారని.. ఎన్నో ఏళ్ల నుంచి జనసేన ని నమ్ముకున్న నేతలను దారుణంగా మోసం చేశారని ఏపీలో జనసేన కార్యకర్తలు, నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఇక తాడేపల్లి నియోజకవర్గంలో ఈ విషయంలోనే విడివాడ రామచంద్ర రావు కు బోలిశెట్టి శ్రీను, కందుల దుర్గేష్ ల మద్య పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది.

తాడేపల్లి గూడెంలో తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చి హూటల్ లో బస చేశారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు అనుచరులు ఆయనపై దాడి చేయడానికి యత్నించారు.  అప్పటికే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్తితిని చక్కదిద్దారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున నాదేండ్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు రామచంద్ర రావు వర్గీయులు.  అంతలోనే అక్కడికి చేరుకున్న బొలిశెట్టి శ్రీను, కందుల దుర్గేష్ నాదేండ్లకు రక్షణగా నిలిచారు. ఏపీలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.