Swetha
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ యాంగిల్ ను చూపించలేదు. పెద్ది నుంచి వదిలిన కొన్ని ఫొటోస్ చూస్తే మరోసారి రామ్ చరణ్ ను అలా చూడొచ్చని ఆశపడుతున్నారు అభిమానులు. పైగా బుచ్చి బాబు ఇస్తున్న ఎలివేషన్స్ మాములుగా లేవు. పెద్ది నుంచే వచ్చే అప్డేట్స్ అన్ని కూడా సినిమా మీద అంచనాలు పెంచెలనే ఉన్నాయి.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ యాంగిల్ ను చూపించలేదు. పెద్ది నుంచి వదిలిన కొన్ని ఫొటోస్ చూస్తే మరోసారి రామ్ చరణ్ ను అలా చూడొచ్చని ఆశపడుతున్నారు అభిమానులు. పైగా బుచ్చి బాబు ఇస్తున్న ఎలివేషన్స్ మాములుగా లేవు. పెద్ది నుంచే వచ్చే అప్డేట్స్ అన్ని కూడా సినిమా మీద అంచనాలు పెంచెలనే ఉన్నాయి.
Swetha
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ యాంగిల్ ను చూపించలేదు. పెద్ది నుంచి వదిలిన కొన్ని ఫొటోస్ చూస్తే మరోసారి రామ్ చరణ్ ను అలా చూడొచ్చని ఆశపడుతున్నారు అభిమానులు. పైగా బుచ్చి బాబు ఇస్తున్న ఎలివేషన్స్ మాములుగా లేవు. పెద్ది నుంచే వచ్చే అప్డేట్స్ అన్ని కూడా సినిమా మీద అంచనాలు పెంచెలనే ఉన్నాయి. కానీ కంటెంట్ గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు టీం. ముఖ్యంగా ఢీల్లి ఎపిసోడ్ గురించి బాగా టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఓ సాంగ్ షూట్ చేస్తున్నారట. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట.
జనవరికు కంప్లీట్ గా షూటింగ్ ఫినిష్ చేసి.. అనుకున్నట్లుగా 2026 మార్చికి సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట బుచ్చి బాబు. గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్న రేంజ్ లో పేలలేదు. కాబట్టి రామ్ చరణ్ అభిమానులు ఆశలన్నీ పెద్ది సినిమా మీదే ఉన్నాయి. దానికి తగినట్టే బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఈ దీపావళికి ఓ ఆడియో సింగిల్ ను రిలీజ్ చేస్తాం అని అన్నారు. కానీ అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
ఇక సాంగ్స్ కోసం బుచ్చి బాబు కావాలని రెహమాన్ దగ్గరకు వెళ్ళాడు. ఈ మధ్య కాలంలో రెహమాన్ ఫార్మ్ లో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ సినిమాకు ఎలాంటి సాంగ్స్ అందించాడు అనే దానిని బట్టి.. రెహమాన్ మార్కెట్ కూడా డిసైడ్ అవుతుంది. ఈసారి రెహమాన్ ప్రేక్షకులను నిరుత్సాహ పరచడని, పెద్దిలో ప్రతీ పాటా.. అభిమానులకు నచ్చుతుందని టీమ్ స్ట్రాంగ్ గా నమ్ముతుంది. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది సాంగ్స్ రిలీజ్ అయితే కానీ తెలీదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.