Swetha
ఇప్పటికే ప్రభాస్ చేతిలో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. ఏది ఎప్పుడు మొదలవుతుందో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ప్రభాస్ టీమ్. ప్రస్తుతం అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. అందరి ఆశలు ఈ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూడబోతున్నారు.
ఇప్పటికే ప్రభాస్ చేతిలో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. ఏది ఎప్పుడు మొదలవుతుందో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ప్రభాస్ టీమ్. ప్రస్తుతం అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. అందరి ఆశలు ఈ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూడబోతున్నారు.
Swetha
ఇప్పటికే ప్రభాస్ చేతిలో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. ఏది ఎప్పుడు మొదలవుతుందో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ప్రభాస్ టీమ్. ప్రస్తుతం అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. అందరి ఆశలు ఈ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూడబోతున్నారు. ఆ తర్వాత ఉన్న సిక్వెల్స్ లిస్ట్ గురించి తెలియనిది కాదు. ఇవన్నీ ఇలా ఉంటె ఇప్పుడు టాలీవుడ్ లో మరొక క్రేజి కాంబినేషన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే లెక్కల మాస్టారు , డార్లింగ్ కాంబో. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం అని చెప్పొచ్చు. ఎప్పటినుంచో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వలన అది సాధ్యపడలేదట. ఇక ఈసారి తగ్గేదె లే అంటూ సుకుమార్ దీనిపై వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు దీనికి లీడ్ తీసుకోబోతున్నారట. అయితే ఇది ఇప్పట్లో సాధ్యపడుతుందా అంతే కాస్త సందేహమే. ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత పుష్ప 3 లైన్ లో పెట్టుకున్నాడు. కానీ పుష్ప 3 కంటే ముందు.. ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ ఉందని టాక్.
ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలకు కూడా సై అంటున్నాడు కాబట్టి.. జెట్ స్పీడ్ లో తన ఇన్ హ్యాండ్ మూవీస్ ని కంప్లీట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఈలోపు సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే. వెంటనే ప్రభాస్ సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. సుకుమార్ కు ఎప్పటినుంచో ఓ భారీ యాక్షన్ మూవీ చేయాలనే డ్రీం ఉండేదట. సో ప్రభాస్ తో ఇలాంటిది ఏమైన ప్లాన్ చేస్తాడేమో చూడాలి, ఇక దీని గురించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. అవి ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.