విజయవాడ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఘోరానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం పేరుతో ఆమెను నమ్మించి ఆస్పత్రిలో ఉంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై […]
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వం అనివార్యం కావచ్చు. చంద్రబాబు అనంతరం లోకేష్ చేతుల్లోకే పార్టీ పగ్గాలు వచ్చి చేరతాయి. దానిని ఎవరూ కాదనలేరు. తప్పు పట్టలేరు కూడా. అయితే ఈ ఎన్నికలకు మాత్రం నారా లోకేష్ ను ఒకింత దూరం పెట్టాలన్నది చంద్రబాబు యోచన. టీడీపీలో నాయకత్వ సమస్య ప్రస్తావన రాకుండా ఉండాలంటే లోకేష్ ను పార్టీ ముఖ్య నిర్ణయాలకు కొంతదూరంగా ఉంచాలని సీనియర్లు కూడా బాబుకు చెప్పారని సమాచారం. అయితే ఇటీవల జరిగిన పార్టీ […]
ఈ రోజు (ఏప్రిల్ 20) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులెందరో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ […]
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శపథం చేశారు. ఇలాంటి శపథమే మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కొడాలి నాని కూడా చేశారు. చంద్రబాబు జన్మలో ముఖ్యమంత్రి కాలేరని, ఒక వేళ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని శపథం చేశారు. నాని చేసిన వ్యాఖ్యలే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా […]
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతలు ఆ అనుభవంతో ప్రజలకు వివిధ అంశాలపై హితబోధ చేస్తుంటారు. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు, సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సం రోజున పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే సీనియర్ను తాను అంటూ మొదలు పెట్టిన చంద్రబాబు.. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచే పార్టీ […]
అమరావతి చుట్టూ టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఆపార్టీ నేతల ఆర్థిక సామ్రాజ్యం దానితో ముడిపడి ఉండడం అందుకు ప్రధాన కారణం. అనేకమంది నాయకులు వేలకోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షలకోట్ల రిటర్నుల మీద ఆశలు పెట్టుకుని అమరావతి నిర్మాణానికి పూనుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో అమరావతి చుట్టూ ఏర్పడిన సందిగ్ధం తొలగిపోతే టీడీపీ కీలక నేతల ఆర్థిక ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఏకైక రాజధానిగా నిర్ణయం జరిగితే అది ఖచ్చితంగా టీడీపీలో పెత్తనం చేసే నేతలకు భారీలబ్దికి మార్గం […]