మణిపూర్ లో రాజకీయ సంక్షోభం బిజెపికి పెద్ద తలనొప్పిగా తయారు అయింది. రాష్ట్రంలో బిజెపి సర్కార్ పడిపోయే ప్రమాదంలో ఉండటంతో బిజెపికి చెమటలు పడుతున్నాయి. ఈ సందర్భంలో మణిపూర్ లోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు దేశ రాజధాని ఢిల్లీకి చేరడంతో ఆ పచాయితీ ఢిల్లీకి చేరినట్లు అయింది. మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వానికి వారం రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకొన్న నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు హుటాహుటిన రాత్రికి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బిజెపి జాతీయ […]
మణిపూర్ లో అధికార బిజెపి ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కు లేఖ రాసింది. అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహిచాలని కోరింది. అయితే గవర్నర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ కు భంగపాటు తప్పదనిపిస్తోంది. అందుకు మణిపూర్ లో ప్రస్తుతం […]
మణిపూర్‌లో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపి) మద్దతు పొందేందుకు బేరాసారా లు సాగించే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. ఈ నెల 17న బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో బిరెన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్పీపి జాతీయ అధ్యక్షుడు కె. సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్ బిస్వా శర్మ (బిజెపి) […]
మణిపూర్ రాష్ట్రంలోని బిజెపి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇది బిజెపి జాతీయ నాయకత్వానికి సవాల్ గా మారింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి…బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బిజెపి జాతీయ నాయకత్వానికి అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటి, ఈశాన్య మణిపూర్ లో మాత్రం వారి పాచికలు పారలేదు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేక పోయినప్పటికీ మిత్రపక్షాలను కూడగట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా […]
కరోనా విలయతాండవం ఒకవైపు చైనా సరిహద్దులలో ఉద్రిక్తతలు మరోవైపు భారత్‌ను కుదిపేస్తున్నాయి. కానీ దేశంలో రాజకీయాల పార్టీల ఎత్తులు పై ఎత్తులకు మాత్రం విరామం ఉండడం లేదు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా,భాగస్వామ్య పక్షాల మద్దతు ఉపసంహరణతో మణిపూర్‌లో ఎన్. బీరెన్ సింగ్ నాయకత్వంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. బుధవారం బిజెపి,తృణమూల్,నేషనల్ పీపుల్స్ పార్టీలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు అధికారపక్షంను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపికి […]