దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కొత్తగా కరోనా బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిచేస్తూ రూల్ తీసుకొచ్చింది. బుధవారం నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. […]
.. అవును నిజమేనండీ మనందరికీ అందుబాటులోనే ఒక టీకా ఉంది. టీకా అంటే సూదితో గుచ్చి శరీరంలోకి పంపించే మందు కాదండోయ్.. అదే మాస్క్. నోటికి, ముక్కుకూ అడ్డుగా పెట్టుకోవడం ద్వారా కోవిడ్ నుంచి 99శాతానికిపైగా రక్షణ కలిగించే ఆయుధం ఇదే. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంతా కోవిడ్ నియంత్రణకు అత్యంత కీలకమైన మూడు విషయాల్లోనూ మాస్క్దే అగ్రస్థానంగా చెప్పుకొస్తున్నారు. భౌతికదూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేవి మిగిలిన రెండూనూ. అన్లాక్ 5.0 సడలింపుల […]