ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానించి వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించింది. మంచి సలహాలు ఇస్తుందని ఏర్పాటు చేసుకున్న మండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారనే కారణంతో క్యాబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపింది. అయితే ఏపీ మండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఎగువసభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్తు 1958 నుండి 1985 మరియు 2007 నుండి ఇప్పటివరకూ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఏపీలో […]
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి. బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా […]