iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ఒక్కడి వల్లే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందలేదు: సురేష్‌ బాబు

  • Published Sep 19, 2023 | 2:53 PM Updated Updated Sep 19, 2023 | 2:53 PM
  • Published Sep 19, 2023 | 2:53 PMUpdated Sep 19, 2023 | 2:53 PM
చంద్రబాబు ఒక్కడి వల్లే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందలేదు: సురేష్‌ బాబు

వందల కోట్ల రూపాయల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. దీనిపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారని.. వారు అడిగిన సౌకర్యాలు అన్ని కల్పించారని.. పరిశ్రమకు అంత మేలు చేసిన వ్యక్తి.. స్పందించకపోవడం దారుణం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత సురేష్‌ బాబును దీనిపై ప్రశ్నించారు కొందరు రిపోర్టర్లు. అందుకు ఆయన బదులిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ సురేష్‌బాబుని ఉద్దేశించి.. ‘‘సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు ఎంతో చేశారు. ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు అనేంతలా స్థిరపడిపోయింది. అలాంటిది చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో ఎందుకు స్పందించలేదు’’ అని ప్రశ్నించారు. ఇందుకు సురేష్‌ బాబు బదులిస్తూ.. ‘‘చం‍ద్రబాబు నాయుడనే కాదు.. అందరూ సీఎంలు చిత్ర పరిశ్రమకు ఎంతో చేశారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి ఇది కొనసాగుతుంది’’ అన్నారు.

అంతేకాక ‘‘తెలుగు సినీ పరిశ్రమలను చెన్నై నుంచి ఇక్కడకు తీసుకురావడంలో.. సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో.. ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారు. ఆయన తర్వాత చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశారు. నా వరకు సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన వారిలో చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌లు ముందు వరుసలో ఉంటారు. వారి వల్లే టాలీవుడ్‌ ఇక్కడకు రాగలిగింది’’ అని తేల్చి చెప్పారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom