నిండా మునుగుతున్న శివసేన, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జంట వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే కూటమి ప్రభుత్వం MVAని విడిచిపెడతామని ప్రతిపాదించింది. ఒకవేళ తిరుగుబాటు కనుక కొనసాగితే, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ మాట వింటాం, లేదంటే వేటు వేస్తాం. ఇదీ శివసేన వ్యూహం. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ముగింపు ఏంటో క్లియర్ గా తెలిసిపోతూనే ఉంది. శివసేన మాత్రం ఎమోషనల్ ఎండింగ్ కోరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు థాకరే […]
రాజీనామాకు సిద్ధమని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన తర్వాత, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది శివసేన. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే లేవనెత్తిన హిందుత్వ వాదానికి ఉద్ధవ్ థాకరే నిన్ననే సమాధానమిచ్చారు. అయినా తిరుగుబాటు కొనసాగుతోంది. అందుకే ఈరోజు శివసేన వ్యూహం మార్చింది. మీరు కోరినట్లుగానే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి బైటకొచ్చే ఆలోచన చేస్తాం. కాని మీరు 24 గంటల్లోగా తిరుగుబాటుదారులు రావాలని శివసేన చెప్పింది. గౌహతిలోని ఒక హోటల్లో 42 మంది […]