ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. తమ భూముల ఇచ్చేది లేదంటూ పలు చోట్ల యజమానులు భీష్మిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరగుతున్నాయి. తాగాజా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపూడి గ్రామంలో భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై స్థానికులు డీజిల్ పోసి హత్యాయత్నం చేశారు. అనంతరం వారూ డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. […]