నిన్న ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో గాదె వైసీపీలో చేరారు. గాదెతోపాటు ఆయన కుమారెడు గాదె మదుసూధన్రెడ్డి కూడా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. నిన్న టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయం గుంటూరు జిల్లా బాపట్లలో మీడియాకు వెళ్లడించిన గాదె వెంకటరెడ్డి చంద్రబాబుపై […]
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా.. టీడీపీలో రాజీనామాల పర్వం మాత్రం ఆగలేదు. ఇప్పటికే మాజీ మంత్రులు కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఈ ప్రభాకర్లతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా.. వారి సరసన మరో మాజీ మంత్రి చేరారు. గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పారు. గాదెతోపాటు ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మదుసూధన్రెడ్డి కూడా టీడీపీకి రాంరాం […]