సంక్రాంతి పండుగకు ఇక రెండు రోజులే సమయం ఉంది. ఉభయగోదావరి జిల్లాలో జరిగే కోడిపందేలు ఈ సారి కూడా జరుగుతాయా..? లేదా ఈ సారైనా చట్టం గెలుస్తుందా..? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాదికి కోడి పందేలు నిషేధం అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కోడి పందేలు నిర్వహించినా, బరులకు స్థలం ఇచ్చిన వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇక పందేంరాయుళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఏర్పాట్లలో నిమగ్నమైయున్నారు. […]
బరిలో అడ్డంగా నుంచున్నోళ్ళని చుట్టూ తిరగమని చెప్తూ.. చేతిలో చెర్నకోలతో ఓ రౌండు దెబ్బేసేసేరు ఆర్గనైజరు చిన్న రాజు గారు. అలా వేస్తన్నప్పుడే ఫెన్సింగికవతల ఎంత మంది కోళ్ళట్టుకుని నుంచున్నారో ఓ లుక్కు కూడా ఏసేసారు. సంక్రాంతి రోజు అయిదయిపోతుంది. యిక్కడ జూస్తే పందెగాళ్ళింకా కోళ్ళతో రడీగా నుంచుని పందేలకోసం ఎదురు చూస్తన్నారు. అప్పుడే తెఁవిలే యవ్వారం కాదిది అనుకుని, బరి బయటకెళ్ళేరు ఓ రౌండు బ్రాండీ బిగించేద్దామని. ఫోనులో.. బరి చుట్టూ సీరియల్ లైట్లు బిగించమని […]
సంక్రాంతి పండగ నెల ప్రారంభమైన వెంటనే ఉభయగోదావరి జిల్లాలో జరిగే కోడి పందెలపై కూడా చర్చ మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, వ్యాపార వేత్తలు సంక్రాంతి కోడి పందేల కోసం ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంటారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు జరిగే కోడి పందేలలో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ప్రతి ఏడాది దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయలు మేర పందేలు జరుగుతాయని అంచనా. అయితే కోడి […]