హిజాబ్, హలాల్ వివాదాలతో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందాలని యత్నిస్తుంటే.. ఆయా అంశాలతో బెంగుళూరుకు ఉన్న బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటోందని తాజాగా నెలకొన్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. బయోటెక్, సాప్ట్వేర్ రంగాలకు రాజధాని బెంగుళూరు. కార్పొరేట్ కంపెనీలు మౌలిక వసతులతోపాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. అయితే గత నాలుగు నెలలుగా కర్ణాటకలో శాంతిభద్రతల అంశం దారితప్పింది. మొన్న హిజాబ్, ఇప్పుడు హలాల్ వివాదాలు కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. రైట్ వింగ్ సంస్థలు, బీజేపీ అనుబంధ సంస్థలు […]
కర్ణాటకలో హిజాబ్ వివాదం ముగిసిందని భావిస్తుండగా.. మరో కొత్త అంశంపై వివాదం చెలరేగుతోంది. ‘హలాల్’ మాంసాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ కొన్ని రైట్‌వింగ్ గ్రూపులు హిందువులకు పిలుపునివ్వడం వివాదానికి దారితీస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం విస్తృతంగా సాగుతుండడంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించడం తో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘హలాల్’ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం చెప్పడంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆయా గ్రూపులు […]
కర్ణాటక రాజకీయాల్లో సిడీ వివాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే మంత్రి రమేష్ జర్కి హోలీ వీడియోలు కలకలం రేపి, ఆయన పదవికి, రాజకీయ జీవితానికి ఎసరు తెస్తే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై కూడా సీడీల వివాదం మూసుకుంటుంది. కర్ణాటక సీఎం యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీల ఎన్నికలు పూర్తవగానే ముఖ్యమంత్రిగా ఆయన్ను తొలగిస్తారని ఎమ్మెల్యే బసని గౌడ పాటిల్ యత్నాల్ జోస్యం చెప్పారు. […]
‘వచ్చే రెండున్నరేళ్లూ నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా… రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన మీడియాతో అన్నారు. తన నాయకత్వం విషయంలో రాష్ట్ర పార్టీలోను, అధిష్ఠానానికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవని అంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ప్రచారాలు నమ్మొద్దు.. కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడ్యూరప్ప […]
యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి కలిసొచ్చినట్లు లేదు. అందినట్లే అంది చేజారిపోతూ ఉంటుంది. తాజా పరిస్థితులు పదవీకాలం పూర్తయ్యేంతవరకు కూర్చిలో కూర్చోనిచ్చేలా కనిపించడం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. న్యాయస్థానాల్లో ఆయనకు ప్రతికూల తీర్పులు వెలువడుతుండడంతో ముఖ్యమంత్రి మార్పు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. కాగా… యడ్యూరప్ప మాత్రం వచ్చే రెండేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. […]
ఆయనో మఠాదిపతి.. పక్కన కూర్చున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి.. అక్కడ జరుగుతున్నది ఓ బహిరంగ సభ.. ఇలాంటిచోట వీలైతే ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి.. పోట్లాడుకోవాలి. అయితే అక్కడ జరిగింది పూర్తిగా రివర్స్‌లో.. కర్నాటకలో మొన్న జరిగిన ఉందంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓ మఠాదిపతి నిలదీయడం చూస్తే మఠాదిపతులు ఏవిధంగా రాజకీయాలను శాసిస్తున్నారో అర్థమవుతుంది. కర్నాటకలోని దావణగిరి ప్రాంతంలో లింగాయత్ పరంపరకు చెందిన కార్యక్రమంలో వచనానంద స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్ప […]