ఇమేజ్ ఉన్న హీరోతో కమర్షియల్ సినిమా తీసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి కానీ వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ కొత్తగా ఆలోచించకపోతే బాక్సాఫీస్ దగ్గర విజయం దక్కదు. రిస్క్ అనుకోకుండా కొత్తగా ఆలోచిస్తూ మాస్ కి కావలసిన అంశాలను మిస్ కాకుండా యాక్షన్ ప్లస్ కామెడీని బ్యాలన్స్ చేస్తే ఖచ్చితంగా హిట్టు కొట్టొచ్చని నిరూపించిన చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రణం. విలన్ గా వర్షం, జయం, నిజంలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న గోపీచంద్ కు హీరోగా […]