కాకినాడలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. చదువుకుంటూ.. వసతిగృహంలో ఉంటున్న బాలికపై అక్కడి కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా మందు అని చెప్పి మాత్రలు ఇచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాకినాడకు చెందిన 15 ఏళ్ల బాలిక 6వ తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి లేడు. తల్లే అన్నీ చూసుకుంటోంది. ఈ ఏడాది 9వ తరగతి పరీక్షలు రాసింది. బాలిక ఉంటున్న వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) […]