iDreamPost
android-app
ios-app

కాకినాడలో దారుణం.. హాస్టల్ లో ఉంటున్న బాలికపై కరస్పాండెంట్ అఘాయిత్యం

  • Published Jun 05, 2022 | 11:32 AM Updated Updated Jun 05, 2022 | 11:32 AM
  • Published Jun 05, 2022 | 11:32 AMUpdated Jun 05, 2022 | 11:32 AM
కాకినాడలో దారుణం.. హాస్టల్ లో ఉంటున్న బాలికపై కరస్పాండెంట్ అఘాయిత్యం

కాకినాడలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. చదువుకుంటూ.. వసతిగృహంలో ఉంటున్న బాలికపై అక్కడి కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా మందు అని చెప్పి మాత్రలు ఇచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాకినాడకు చెందిన 15 ఏళ్ల బాలిక 6వ తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి లేడు. తల్లే అన్నీ చూసుకుంటోంది.

ఈ ఏడాది 9వ తరగతి పరీక్షలు రాసింది. బాలిక ఉంటున్న వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) ఆమెపై కన్నేశాడు. ఏప్రిల్ లో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. మూడ్రోజులుగా బాలికకు తీవ్రర రక్తస్రావం కావడంతో.. తల్లి ఏమైందని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. చికిత్స కోసం జూన్ 1వ తేదీన కాకినాడ జీజీహెచ్ కు తరలించగా.. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భస్రావం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. బాలిక, తల్లి వాంగ్మూలాలను తీసుకుని కేసు నమోదు చేశారు. కరోనా మందు అని చెప్పి.. ఏవో మాత్రలు ఇచ్చాడని.. అవి వేసుకున్నాక పూర్తిగా మత్తులోకి వెళ్లిపోయానని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా.. విజయకుమార్ పై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpipo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş