గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తుపై ఊహాగానాలకు తెరపడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు ఉండదని, ఒంటరిగానే 150 డివిజన్లలో పోటీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో పాత బస్తీలో టీఆర్ఎస్ ఐదు డివిజన్లలో గెలిచిందని, ఈ సారి ఆ ఐదు డివిజన్లతోపాటు మరో ఐదు డివిజన్లలోనూ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని ఈ సారి కూడా కైవసం […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 1579 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 537 వార్డులు, భారతీయ జనతా పార్టీ 236 వార్డులు, ఎంఐఎం పార్టీ 69 వార్డులు, స్వతంత్రులు, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి పోటీచేసిన వారు 306 వార్డుల్లో గెలుపొందారు. దీంతో 109 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవులు అధికార పార్టీకే దక్కనున్నాయి. […]