జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేతను సమర్ధిస్తూ నీతిఆయోగ్ సభ్యుడు సారస్వత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వివరాల్లోకి వెళితే వీకే సారస్వత్ గాంధీనగర్ లో ఉన్న ధీరుభాయి అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు చేసిన అనంతరం,జమ్మూ కాశ్మీర్ లో వివాదాస్పద సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సంగతిని ప్రస్తావిస్తూ, ఇంటర్నెట్ సేవలను […]
ఈ మధ్య దేశంలో జరుగుతున్న పరిణామాలపై సెలెబ్రిటీలు స్పందించడం లేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్పందిస్తే ఆ విషయంలో ఎందుకు స్పందించారంటూ మరికొందరు స్పందించిన సెలెబ్రిటీలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు పలువురు సెలెబ్రిటీలు. గతంలో దేశంలో అరాచక పాలన సాగుతుందంటూ బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ ల వ్యాఖ్యలపై కొందరు నిరసనలు వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెట్టారు. మరికొందరేమో ఆ వ్యాఖ్యలను సమర్ధించారు. […]
జేఎన్యూలో ఫీజులో పెంపుదలతో మొదలయిన విద్యార్థుల ఆందోళన ఉధృత రూపం దాలుస్తోంది. ఆ వెంటనే సీఏఏకి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఎన్నార్సీని నిరసిస్తూ పోరు సాగించారు. ఈ పరిణామాలకు తోడుగా జేఎన్యూ సబర్మతి హాస్టల్ లో ముసుగులేసుకు వచ్చిన ముష్కరులు అంధులు, అమ్మాయిలు అనే తేడా లేకుండా హాకీ స్టిక్స్ , రాడ్డులతో దాడి చేయడం కలకలం రేపింది. దేశమంతా విద్యార్థి ఉద్యమం ఎగిసిపడుతోంది. దాడి చేసింది ఏబీవీపీ కార్యకర్తలేనని ఆ శిబిరానికి చెందిన నాయకులు టైమ్స్ […]