తన ప్రజా సంకల్ప పాదయాత్రలో రైతుల బాధను చూసి, భూముల రీ సర్వే కార్యక్రమం చేపడుతున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి వేసి సర్వేను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని కార్యక్రమం. ఇది జరగాలి, ప్రజలకు మంచి జరగాలనే […]