Dharani
Dharani
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా.. ఏసీబీ కోర్టు.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రీ సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు.. జైలు అధికారులు ఆయనకు ప్రత్యేక గది, ఇతర సౌకర్యాలు కల్పించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. టీడీపీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. కానీ రాష్ట్రంలో బంద్ ప్రభావం పెద్దగా లేదు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ వివరాలు..
జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో.. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీని మీద సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ ఫోటోలను కూడా ముద్రించారు. ఫ్లెక్సీలో ఇలా రాసుకొచ్చారు.. ‘‘నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి.. నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నాడు.. అంతటితో ఆగలేదు.. నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా తన కుటిల రాజకీయాలకు వాడుకుని.. చివరికి నా మనమడు తారకరత్న మరణాన్ని కూడా తన కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న నీచుడు చంద్రబాబు. అలాంటి వాడికి బుద్ది చెప్పి.. నా ఆత్మకు శాంతిని చేకూర్చావు జగన్. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళుతున్న సందర్భంగా.. తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు (సెప్టెంబర్ 10ని) నా ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి.. ఇట్లు నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్)’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.