స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రకటించారు. ఈ విషయం అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన నేతలకు మింగుడు పడకపోయినా.. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో కిమ్మనకుండా ఉండిపోయారు. ఇదిలా […]
ఆంధ్రప్రదేశ్ లో వినియోగదారులకు ఇంటివద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో నేటి నుంచి అమల్లోకి రానుంది. రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇసుక కొనుగోలుదారులు భవన నిర్మాణ ప్రదేశం వివరాలు పోర్టల్‌లో ఉంచి, మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తారు. దీంతో నిర్మాణ ప్రదేశానికి నేరుగా ఇసుక వచ్చేస్తుంది. బుకింగ్ డబ్బు చెల్లించడంతో పాటు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. రవాణా చార్జీ కూడా ఏపీఎండీసీ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కనెక్ట్ టు ఆంధ్రా కింద 5 కార్పొరేట్ సంస్థలు నాడు-నేడుకు తోడ్పాటు అందించనున్నాయి. విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ పాటశాలల్లో నాడు నేడు కింద ఈ 5 కార్పొరేట్ సంస్థలు అభివృద్ది కర్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 402 ప్రభుత్వ పాఠశాలల్లో హెటిరో సంస్థ నాడు – నేడు చేపట్టనుంది. వైఎస్సార్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాజధాని అంశంపై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు రావచ్చునని, రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సభకు తెలియజేసారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ […]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాకు రానున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయన పర్యటిస్తూ పార్టీ బలోపేతంకోసం నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరిస్తున్న చంద్రబాబు అనంతకు రానున్నారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేసారు. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోటగా ఉండేది. గత […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దిశ చట్టంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రశంశల వర్షం కురుస్తోంది. దిశ చట్టంపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి పలు రాష్ట్రాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే నారా లోకేష్‌తో సహా కొన్ని మీడియా సంస్థలు మాత్రం దిశ చట్టం ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయడానికి నానా పాట్లు పడుతుండటం మాత్రం విచారకరం. మహిళలపై దాడుల విషయంలో కఠిన శిక్షలు…అది కూడా […]
రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ ల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మూడవ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా 6వ రోజైన సోమవారం ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ లో ప్రతిపక్షం వాగ్వాదానికి దిగడం తో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లు కు చర్చ జరుగుతుంటే…సిగ్గులేకుండా చంద్రబాబు గొడవలకు దిగడం […]
అసెంబ్లీలో 23 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఉంటే పార్టీలో ఒక్కగాను ఒక్క మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవాని గారి చేత బార్లు.. బ్రాండ్లు..అంటూ మహిళలకి అందులోను అనుభవంలేని మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ శాసన సభ్యురాలి చేత మాట్లాడించడం ఏమైనా బాగుందా బాబుగారు? పాపం ఆమెకి ఏమి తెలుసు ఆమె ఏమైనా రాత్రి 8 తరువాత పెద్దగా బయటకి వచ్చేదా?? మద్యం దుకాణాల దగ్గర బార్ షాప్ ల దగ్గర పరిస్థితులు ఎలా ఉంటాయో చూసేదా […]
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తరువాత కంక్లుజివ్ ఎవిడెన్స్ ( బలమైన సాక్ష్యాలు) ఉంటే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ఈ బిల్లు రూపోందించారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులకు దిగితే మొదటిసారి 2 […]
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతానంటు తనపై వస్తున్న వదంతులపై నర్సాపురం వై.సి.పి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. వైసీపీలో తనకి సముచిత గౌరం వుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో తనకి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పారు. సి.యం జగన్ సిఫార్స్ మేరకే కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచినా తనకి పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మెన్ పదవి వచ్చిందని స్పష్టం చేశారు. తాను గతంలో […]