Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాకు రానున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయన పర్యటిస్తూ పార్టీ బలోపేతంకోసం నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరిస్తున్న చంద్రబాబు అనంతకు రానున్నారు.
పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేసారు. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పార్టీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో ఉన్న 14 శాసనసభ స్థానాలకుగాను కేవలం రెండుచోట్ల మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఇక ఎంపీ స్థానాలైతే రెండింట్లోనూ ఓటమిపాలైంది.
ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకూ మూడు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మకరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని మూడు ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపిన నేపధ్యంలో కర్నూలు కూడా ఒక ప్రాంతం కాబట్టి చంద్రబాబు రాయలసీమలో ఉండి రాయలసీమకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తారా ?వ్యతిరేకిస్తే ఏ కారణాలు చెప్తారు అనేది అని సర్వత్రా ఆసక్తిగా మారింది.