iDreamPost
android-app
ios-app

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 180 రోజుల లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు..

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 180 రోజుల లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం..ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మెప్పు పొందుతోంది. గత ఎన్నికల్లో భాగంగా చేసిన నవరత్నాల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసి తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అంతేనా ప్రభుత్వ ఉద్యోగుల చేస్తున్న డిమాండ్లు సరైనవేతే.. వాటిని నెరవేరుస్తుంది జగన్ సర్కార్. తాజాగా జనవరిలో అంగన్ వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేయగా.. జీతాల్లో కోత పడిన సంగతి విదితమే. ఆ కాలాన్ని విధి నిర్వహణలోనే ఉన్నట్లు లెక్కించి..వేతనాలు చెల్లించాలని తెలిపింది. అలాగే మున్పిపల్ కార్మికుల విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడు మహిళా ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

పిల్లల సంరక్షణ సెలవులు (చైల్డ్ కేర్ లీవ్స్)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలు అనగా.. 180 రోజుల సెలవుకు సంబంధించి గతంలో విధించిన గడువును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే ఈ జీవో జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. అంతేకన్నా ముందే ఈ ఉత్తర్వును ఇచ్చింది జగన్ సర్కార్. గతంలో తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోపు.. మహిళా ఉద్యోగులు సెలవులు వాడుకోవాల్సి ఉండేది. కానీ ఆ షరుతును తొలగిస్తూ.. మహిళలు ఉద్యోగులు.. ఉద్యోగ విరమణ లోపు ఎప్పుడైనా వినియోగించుకునే విధంగా ఉత్తర్వును ఇచ్చింది. దీంతో మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నట్లుగా ఏపీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు. 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు అమరావతిలోనే స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని రూల్స్ ప్రకారమే.. ఇప్పుడు కూడా స్థలాల  ధర, విస్తీర్ణం ఉంటాయని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే శుక్రవారమే ఉద్యోగులు, పింఛన్ దారులకు డీఏల మంజూరు, మున్సిపల్ కార్మికులపై సమ్మెకాలంలో నమోదైన కేసులను ఎత్తివేయడం, అంగన్ వాడీ కార్యకర్తలకు సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం వంటి నిర్ణయాలు తీసుకుంది.