iDreamPost
iDreamPost
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతానంటు తనపై వస్తున్న వదంతులపై నర్సాపురం వై.సి.పి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. వైసీపీలో తనకి సముచిత గౌరం వుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో తనకి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పారు. సి.యం జగన్ సిఫార్స్ మేరకే కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచినా తనకి పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మెన్ పదవి వచ్చిందని స్పష్టం చేశారు. తాను గతంలో నాలుగేళ్ళు బిజేపిలో ఉన్నానని అప్పుడు ఉన్న సాన్నిహిత్యంతోనే మోడీ కనిపిస్తే పలకరిస్తారని అలాగే నేను నమస్కారం చేస్తానని ఈ విషయం మీద పార్టీలొ ఉన్న ఒక ముగ్గురు ముఖ్యమంత్రిగారికి తనకి మధ్య లేని పోని విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, వాళ్లే బయటికి ఇలాంటి పుకార్లు పంపుతున్నారని చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా చాల మంది ఎంపీలు గతంలో పార్టీలు ఇచ్చారని, ఈ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా సబార్డినేట్ చైర్మన్ గా ఎన్నిక కావడం వలన తాను పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని నేను ఇచ్చిన ఈ విందు పార్టీలకు ప్రాంతాలకు అతీతం గా ఇచ్చానని , మా పార్టి ఎంపీలను కూడా విందుకు పిలిచానని, ఇది వ్యక్తిగతమే తప్ప ఎలాంటి ఉద్దేశం దీనివెనక లేదని , కొంతమంది పని కట్టుకుని దీనిపై దుష్ప్రచరాం చేశారని చెప్పుకొచ్చారు..