iDreamPost
android-app
ios-app

నా కష్టాలు ఇంకెవరికీ రాకూడదు. అందుకే రాజకీయాల్లోకి : అంబటి రాయుడు

క్రికెటర్ గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ఇప్పుడు రాజకీయాలతో కొత్త అధ్యాయనికి శ్రీకారం చుట్టాడు. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.

క్రికెటర్ గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ఇప్పుడు రాజకీయాలతో కొత్త అధ్యాయనికి శ్రీకారం చుట్టాడు. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.

నా కష్టాలు ఇంకెవరికీ రాకూడదు. అందుకే రాజకీయాల్లోకి : అంబటి రాయుడు

కెరీర్ ఏదైనా కూడా కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. టాలెంట్ కు తగినట్లు ప్రోత్సాహకం ఉండాలి, అవకాశాలు దక్కాలి, కొన్నిసార్లు లక్ కూడా ఫేవర్ చేయాలి. ఈ మూడు అంశాలు లేక కెరీర్లు అర్థాంతరంగా ముగిసిపోయిన అథ్లెట్లు, స్టార్లు, క్రికెటర్లు ఎందరో ఉన్నారు. అలాంటి జాబితాలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. లక్షల్లో అభిమానులు, కావాల్సినంత టాలెంట్ ఉంది. కానీ, చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదు అనేది జగమెరిగిన సత్యం. కానీ, రాయుడు మాత్రం ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అవకాశం ఇవ్వని వాళ్లను కూడా ఆప్యాయంగా పలకరించాడు. తనను అభిమానించే ఫ్యాన్స్ కోసం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. ఇప్పుడు ఒక గొప్ప లక్ష్యంతో రాష్ట్ర రాజకీయాల్లోకి, ప్రజా సేవలోకి అడుగుపెట్టాడు.

క్రికెట్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన తెలుగు స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. నిజానికి పార్టీలో చేరడానికి ముందే.. రాష్ట్రం అంతటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు, కష్టాలు అడిగి తెలుసుకున్నాడు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరితో మమేకమయ్యాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎంత రిస్క్ అనే విషయం తెలిసి కూడా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాడు. జెంటిల్ మన్ క్రికెట్ లో లాగా రాజకీయాల్లో వాతావరణం ఉండదు. ఎంత మంచిగా ఉన్న బురద జల్లేవాళ్లు, రాళ్లు వేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. చక్కగా ఏ కోచ్ గానో.. ఏ జట్టుకో మెంటర్ గానో, లేదంటే కామెంటేటర్ గా కూడా రాయుడు తన కెరీర్ ని కొనసాగించవచ్చు. కానీ, అలాంటి ఈజీ టాస్కులను కాకుండా ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక ఉన్నతమైన రాజకీయాల్లోకి అడగుపెట్టాడు. ఇన్నాళ్లు రాయుడు ఎదుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే విషయంపై చాలామందికి క్లారిటీ లేదు. కానీ, ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన లక్ష్యం ఏంటి? అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? అనే విషయాల గురించ స్పష్టమైన కామెంట్స్ చేశాడు.

“మా గ్రాండ్ ఫాదర్స్ అప్పటి నుంచి సొసైటీకి ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నారు. నేను కూడా ఈ సమాజానికి ఏదో ఒటకి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ముఖ్యంగా ఒక ఆలోచన ఉండేది. ప్రతి మనిషికి సమాన అవకాశాలు దక్కాలి. వాళ్లు ధనికులా? పేదలా? వారికి బ్యాగ్రౌండ్ ఉందా అనే విషయాలు చూడకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. వారికి సమాన అవకాశాలను అందజేయాలి. అది నా మైండ్ లో ఎప్పుడూ ఉంటుంది. సిస్టమ్ లో నేను చాలా ఫేస్ చేశాను. అలా మనం ఎవరిని చూసినా గానీ ఏ ఊరు, ఏ బ్యాగ్రౌండ్, ఏ సామాజికవర్గం అవన్నీ చూడకుండా.. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి అనేది నా కోరిక. చిన్నప్పటి నుంచి నాకు ఆ ఆలోచన ఉండేది. అందరినీ సమానంగా చూడాలి. అదే నా ప్రధాన లక్ష్యం. అభివృద్ధి పరంగా చూసుకున్నా.. అందరూ డెవలప్ కావాలి. ఒక 1 పర్సెంట్, 2 పర్సెంట్ రిచ్ పీపుల్ మాత్రమే కాకుడం.. మిగిలిన 98 పర్సెంట్ కూడా డెవలప్ కావాలి అనేది అభివృద్ధిలో ముఖ్యమైన పాయింట్ అని నేను భావిస్తాను. ఏ పార్టీలోకి వెళ్లాలి అనేది నాకు పెద్ద కష్టం అనిపించలేదు. నాన్న గారు వైఎస్సార్ గారికి చాలా పెద్ద అభిమాని. నాన్న నుంచి వైఎస్సార్ గారి ఐడియాలజీని తెలుసుకున్నాను. అందరి పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైసీపీ అనే భావనతోనే.. నేను వైసీపీలో చేరాను” అంటూ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. అంబటి రాయుడు పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి.