ఆయన బ్రాహ్మణుడు. అందులోనూ ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ పాస్ అయ్యి, రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసారు. తన పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో కి వెళ్ళిన ఆ వ్యక్తి సాటి బ్రాహ్మణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆలయాల్లో అర్చక త్వానికి ఎలాంటి పదవీ విరమణ ఉండదని కోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా ప్రభుత్వం పాటిస్తూ ఉంటే మాత్రం ఆయనకు నచ్చడం లేదు. దానికి ఏదో రాజకీయ రంగు పూసి ఆనంద పడాలన్న ఉద్దేశం […]
పింఛన్ డోర్ డెలివెరీ కార్యక్రమాన్ని విమర్శిస్తూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పెట్టిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ విధానం మంచిదే అంటూ ఆయన మళ్లీ ట్వీట్ చేసే స్థాయికి ఆయన ట్వీట్కు స్పందన వచ్చింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. పింఛన్ డోర్ డెలివెరీ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ గత నెల నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. […]
అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీతో సహా బీజేపీ, జనసేన నేతలు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ప్రక్రియకు వ్యతిరేకంగా మీడియాలోని ఒక వర్గం, తెలుగుదేశం పార్టీ జాకీలు పెట్టి లేపినా ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోనే దావానంలాగా రాష్ట్రం అంతా వ్యాపించిందని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం విఫలమైన విషయాన్ని ఇకనైనా […]
ప్రజలకు మేలు చేయడం కంటే న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తారని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఎందరో మేధావులు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చెబుతుంటారు. తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్కు జాగ్రత్తలు చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ […]