రేషన్‌కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి వరకూ రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం, శెనగలు అందించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరుకులకు ఇది అదనం. కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోవడం, లాక్డౌన్ […]
ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చాటుతోంది. చెప్పిన దానికి మించి సహాయక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా విపత్తు వేళ ప్రజలకు తోడుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ప్రజలకు మాత్రం అవకాశం ఉన్నంత మేరకు అండగా నిలవాలని ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో మరో విడతకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో […]
ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణను లాక్ డౌన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తెలంగాణలో 26కు చేరుకున్నాయని సీఎం చెప్పారు. ఒకరు మినహా అందరూ విదేశాల నుంచి వచ్చేవారని తెలిపారు. 1897 ఎపిడమిక్ ఎసెన్సియల్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలు మినహా అన్నింటిని బంద్ చేస్తున్నట్లు చెప్పారు. 31వ తేదీ వరకు […]