iDreamPost
android-app
ios-app

Union Budget 2024: బడ్జెట్‌లో పేదలకు శుభవార్త.. మరో ఐదేళ్ల పాటు ఉచితంగా

  • Published Jul 23, 2024 | 12:15 PM Updated Updated Jul 23, 2024 | 12:15 PM

Union Budget 2024-PMGKAY Free Ration: బడ్జెట్‌లో పేదలకు భారీ శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. వారికి మరో ఐదేళ్ల పాటు ఉచితంగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు..

Union Budget 2024-PMGKAY Free Ration: బడ్జెట్‌లో పేదలకు భారీ శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. వారికి మరో ఐదేళ్ల పాటు ఉచితంగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు..

  • Published Jul 23, 2024 | 12:15 PMUpdated Jul 23, 2024 | 12:15 PM
Union Budget 2024: బడ్జెట్‌లో పేదలకు శుభవార్త.. మరో ఐదేళ్ల పాటు ఉచితంగా

దేశ ప్రజలందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. ముచ్చటగా మూడో సారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఏడోసారి. ఇప్పటి వరకు ఆమె వరుసగా ఏడు  బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు క్రియేట్ చేశారు. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పుడు నిర్మల సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో భారతదేశ చరిత్రలో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి వరుసగా ఆరు బడ్జెట్లను సమర్పించారు. ఇప్పుడు ప్రవేశపెట్టింది ఏడోది. ఇక బడ్జెట్‌లో పేదలకు భారీ శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. ఆ వివరాలు..

బడ్జెట్‌లో పేదలకు నిర్మలమ్మ తీపి కబురు చెప్పారు. ఆకలితో ఎవరు బాధపడకూడదనే ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం.. పేదలకు ఉచితంగా రేషన్‌ అందించేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా బడ్జెట్‌లో ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తామని అప్పట్లోనే కేంద్రం ప్రకటించింది. తాజాగా మరోసారి దీనిపై ప్రకటన చేశారు.

పీఎంజీకేఏవై కింద అంత్యోదయ అన్న యోజన (ఏఏఐ) గృహాలు, ప్రాధాన్యతా గృహాల (పీహెచ్‌హెచ్‌) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది మోదీ సర్కారు. కరోనా విపత్కర సమయంలో కేంద్రం ఉపాధి, వృత్తి కోల్పోయిన వారికి నెలవారి భోజనానికి సరిపడా బియ్యాన్ని ఉచితంగా అందించింది. ఇప్పుడు కూడా ఆ పథకాన్ని అలానే అమలు చేయనున్నారు. మరో ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉండనుంది.

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 3.0ను ప్రవేశపెడుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో సారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నాని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్ధులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు.