కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారతదేశంలో విధించిన లాక్డౌన్ తో ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమవడంతో చాలా OTT ప్లాట్ఫామ్లలో కంటెంట్ వినియోగం గనణీయంగా పెరిగింది. ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో వినోదం కోసం OTT ప్లాట్ఫారమ్లను ఆశ్రయించారు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకుని హాట్స్టార్ డిస్నీ సంస్థ హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని 3 సంవత్సరాలు అద్దెకు తీసుకునట్టు తెలుస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా పేరొందిన […]
హైదరాబాద్ లో అంతకంతా పెరుగుతూపోతున్న కరోనా కేసులతో పాటు టీవీ సీరియల్స్ షూటింగ్ లో యాక్టర్స్ దాని బారిన పడుతుండటంతో సినిమా తారలు హై అలెర్ట్ అయిపోయారు. వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్ లో అడుగుపెడదాం అనుకున్న వాళ్లంతా దాదాపు డ్రాప్ అయ్యారని ఫిలిం నగర్ న్యూస్. ముఖ్యంగా స్టార్లు ససేమిరా అని చెబుతున్నట్టు టాక్. ఈ పరిస్థితి ఇంకో రెండు నెలలు కొనసాగేలా ఉంది కాబట్టి అప్పటిదాకా ఆశలు పెట్టుకున్నా లాభం లేదు. […]
కరోనా సంఘానికే కాదు సినిమా పరిశ్రమకూ బోలెడు పాఠాలు నేర్పించేసింది. ఇకపై ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించే బడ్జెట్లు ఉండకపోవచ్చు. స్టార్ల రెమ్యునరేషన్లకు కోతలు పడవచ్చు. విదేశాల్లో నడిచే కథలకు గుడ్ బై చెప్పొచ్చు. ఔట్ డోర్ షూటింగులు వద్దనే డిమాండ్లు పెరగొచ్చు. ఇంకా చాలా చాలానే మార్పులు చూడబోతోంది పరిశ్రమ. ముఖ్యంగా కొత్త టాలెంట్ కు దారులు తెరవబోతున్నారు. నిర్మాతల ఇళ్ళు, ప్రొడక్షన్ హౌసుల ఆఫీసుల చుట్టూ తిరిగే యాతన న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ […]
సినిమా పరిశ్రమలో అందం ఉంటేనే హీరోయిన్ కు మనుగడ అనుకుంటాం కానీ కేవలం టాలెంట్ తో కూడా నెగ్గుకురావొచ్చని నిరూపించే వాళ్ళు అరుదుగా ఉంటారు. స్కిన్ షో చేయకుండానే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వాళ్ళలో అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి జెనరేషన్ కు ఈమె ఎవరో తెలియదు కానీ 80 దశకంలో సినిమాలు చూసినవాళ్లకు సుపరిచితురాలే. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో ఆఫ్ బీట్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న అర్చన తెరంగేట్రం చేసింది మధురగీతంతో […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడు. అంతకుముందు టాలీవుడ్ లో ఓ హీరో. అటు పరిశ్రమ, ఇటు సొంత రాష్ట్రం ప్రయోజనాల కోసం చొరవ చూపాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు. కానీ ఆయన దానిని విస్మరించారు. కనీసం స్పందించలేదు. సరికదా చొరవ తీసుకుని షూటింగులకు అనుమతి సహా పలు సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసేందుకు చేసిన ప్రయత్నాలపై కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చేయకపోగా చేస్తున్న వారి మీద నిందలు వేసే ప్రయత్నం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. […]
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈనెల 9న చిరంజీవి సారధ్యంలోని బృందం అమరావతి రాబోతోంది. సీఎం జగన్ ని కలిసి తమ సమస్యలు విన్నవించబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమకు ప్రభుత్వం తరుపున కావాల్సిన సహాయాన్ని అర్థించబోతోంది. దాంతో ఈ సమావేశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. వాస్తవానికి చాలాకాలంగా ఏపార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికయిన తర్వాత ఆయా నేతలను సినీ ప్రముఖులు ఎక్కువ మంది కలవడం ఆనవాయితీ. అయితే ఈసారి అలా […]
జూన్ మొదటి వారం అయిపోయింది. షూటింగులు ఇంకా మొదలుకాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ రావడం లేదు. మరోవైపు టీవీ ఛానెల్స్ లో ఇదుగో మేమొస్తున్నాం అంటూ యాక్టర్లు ప్రకటనలు ఇస్తున్నారు. నిజానికి అవి కూడా స్టార్ట్ కాలేదు కానీ ఊరికే అలా హడావిడి చేస్తున్నారు. మరోవైపు థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కావడం లేదు. ఆగస్ట్ అని ఒకరు లేదు సెప్టెంబర్ తర్వాతే […]
ఇంకా షూటింగులు మొదలుకాలేదు కానీ లాక్ డౌన్ కు ముందు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు తెచ్చేసుకుంటున్నాయి. రెండు వారాల ముందే అనుష్క ‘నిశబ్దం’ యు/ఎ తెచ్చుకోగా తాజాగా సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా ఇదే క్యాటగిరిలో ధృవీకరణ అందుకుంది. మరోవైపు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తమిళ్ లో ఈ తతంగం పూర్తి చేసుకుంది. తెలుగు వెర్షన్ కూడా రేపో ఎల్లుండో జరిగిపోతుంది. అయితే […]
సినీ ఇండస్ట్రీలో ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ మధ్య జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. షూటింగ్ లు మళ్ళీ ప్రారంభించేందుకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కొందరు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశంపై బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. రియల్ ఎస్టేట్ చేసుకుని భూములు పంచుకునేందుకే మీటింగులు పెట్టారంటూ బాలయ్య మండిపడ్డాడు. మంత్రితో జరిగిన సమావేశంలో తనను పిలవలేదన్న అక్కసే బాలకృష్ణ మాటల్లో బాగా కనబడింది. సీన్ కట్ చేస్తే తొందరపడి నోరుపారేసుకున్న […]
ఉన్నట్టుండి చిరంజీవినే కాదు మొత్తం టాలీవుడ్ నే మౌనం ఆవహించినట్టు అయ్యింది. ఇటీవలే తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ తో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన మీటింగులు, సహాయా కార్యక్రమాల్లో తనను పిలవలేదని, ఏవో భూముల గురించొ మాట్లాడుకున్నారని బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక ఒక్కసారి అగ్గి రాజుకుంది. కొందరు కోరుకున్నట్టు దీని మీద పరిశ్రమ రెండుగా చీలకపోయినా ఓ మీడియా వర్గం మాత్రం ఇష్యూని భూతద్దంలో చూపించి వివాదం పెద్దది కావడంతో తన […]