iDreamPost
android-app
ios-app

పవన్, వెంకీలకే గోల్డెన్ ఛాన్స్

  • Published Jun 26, 2020 | 10:37 AM Updated Updated Jun 26, 2020 | 10:37 AM
పవన్, వెంకీలకే గోల్డెన్ ఛాన్స్

హైదరాబాద్ లో అంతకంతా పెరుగుతూపోతున్న కరోనా కేసులతో పాటు టీవీ సీరియల్స్ షూటింగ్ లో యాక్టర్స్ దాని బారిన పడుతుండటంతో సినిమా తారలు హై అలెర్ట్ అయిపోయారు. వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్ లో అడుగుపెడదాం అనుకున్న వాళ్లంతా దాదాపు డ్రాప్ అయ్యారని ఫిలిం నగర్ న్యూస్. ముఖ్యంగా స్టార్లు ససేమిరా అని చెబుతున్నట్టు టాక్. ఈ పరిస్థితి ఇంకో రెండు నెలలు కొనసాగేలా ఉంది కాబట్టి అప్పటిదాకా ఆశలు పెట్టుకున్నా లాభం లేదు. ఈ నేపథ్యంలో 2021 సంక్రాంతికి ఏ సినిమాలు రావొచ్చనే దాని గురించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. చిరంజీవి ఆచార్య ఇంకా చాలా బాలన్స్ ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి షూట్ మొదలుపెట్టినా డెడ్ లైన్ అందుకోవడం అసాధ్యం. అసలు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎంట్రీనే ఇప్పటిదాకా జరగలేదు. సో నో ఛాన్స్.

ప్రభాస్ 20 అయినా వస్తుందేమో అనుకుంటే ఇంకా సగం దాకా పెండింగ్ ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం పడుతుంది కాబట్టి హడావిడి పడి లాభం లేదు. అందులోనూ ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే వేగంగా చేశారు కానీ ఇకపై అలా కుదరదు. బాలయ్య జోడి ఎవరో తేలనే లేదు. రాశి ఖన్నాను అడిగితే నో చెప్పిందట. అంజలి, శ్రియ శరన్ అంటున్నారు కానీ ఎంతవరకు ఓకే అవుతుందో తెలియదు. ఆచార్య లాగే ఇదీ అక్టోబర్ కన్నా ముందు అవకాశం లేదు. ఆపై రెండు నెలల్లో పూర్తి చేయడం జరగని పని.

సో ఛాన్స్ ఉన్నది ఇప్పుడు ఇద్దరికే. ఒకటి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. రెండోది వెంకటేష్ నారప్ప. కేవలం ఒక నెల రోజులు పని చేస్తే రెండూ పూర్తయిపోతాయి. కాబట్టి పండగ బరిలో హ్యాపీగా దిగొచ్చు. కాకపోతే దసరా తర్వాత ఖచ్చితంగా షూటింగ్ మొదలైతేనే. లేదూ నవంబర్ లో జరిగినా మేనేజ్ చేయొచ్చు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రిలీజులను కూడా పెద్ద అయోమయంలో నెట్టేస్తోంది. ఇక్కడ చెప్పింది కనక జరిగితే వెంకటేష్, పవన్ లకు మంచి ఛాన్స్ అవుతుంది. ఫెస్టివల్ సీజన్ ని సోలోగా దున్నేయెచ్చు. ఇప్పటికైతే ఎదురు చూపులు పొడిగించడం తప్ప వేరే మార్గం లేదు.