iDreamPost
android-app
ios-app

ఎవరూ నోరు మెదపరేమి

  • Published Jun 07, 2020 | 5:57 AM Updated Updated Jun 07, 2020 | 5:57 AM
ఎవరూ నోరు మెదపరేమి

జూన్ మొదటి వారం అయిపోయింది. షూటింగులు ఇంకా మొదలుకాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ రావడం లేదు. మరోవైపు టీవీ ఛానెల్స్ లో ఇదుగో మేమొస్తున్నాం అంటూ యాక్టర్లు ప్రకటనలు ఇస్తున్నారు. నిజానికి అవి కూడా స్టార్ట్ కాలేదు కానీ ఊరికే అలా హడావిడి చేస్తున్నారు. మరోవైపు థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కావడం లేదు. ఆగస్ట్ అని ఒకరు లేదు సెప్టెంబర్ తర్వాతే అని మరొకరు ఎవరి వెర్షన్ లో వాళ్ళు నిర్మాతలు మాట్లాడుతున్నారు. అసలీ గందరగోళం ఎప్ప టికి తీరుతుందో అంతు చిక్కడం లేదు.

జన జీవనం మాత్రం మెల్లగా సాధారణ స్థితికి వచ్చేస్తోంది. గుళ్ళు, ప్రార్ధన మందిరాల తలుపులు తెరుచుకోబోతున్నాయి. స్కూల్స్ కూడా ఆగస్ట్ 3 నుంచి అనే హింట్ ఇప్పటికే వచ్చేసింది. మరి సినిమా ఒక్కటే ఏం పాపం చేసిందనే అనుమానం అందరిలోనూ మెదులుతోంది. ఈ నెలాఖరువరకైతే ఛాన్స్ లేదు కానీ ఆపై కూడా ఎవరూ గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక రిలీజ్ డేట్లు, ఓటిటి ఆప్షన్లు వీటికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ తెలియడం లేదు.పోస్ట్ ప్రొడక్షన్లు, సెన్సార్లు అన్ని అవుతున్నాయి కానీ ఎవరూ ఫలానా టైంకి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పడం లేదు. ఇదంతా ఒక ఎత్తయితే గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో మౌనం రాజ్యమేలుతోంది. బాలయ్య కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

నిర్మాత సి కళ్యాణ్, నాగబాబు ఇప్పుడంతా గతమని చెబుతున్నారు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. మూవీ లవర్స్ మాత్రం తమ ఎదురు చూపులకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికైనా గుళ్ళ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు షూటింగులు, థియేటర్లకు సంబంధించి ఏదో ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే బెటర్. మొత్తం కాకపోయినా కనీసం కొన్నైనా తెరిచి ప్రయోగాత్మకంగా పాత సినిమాలు వేసి పబ్లిక్ ని అలవాటు చేస్తే మంచిది. లేదూ అది ఫలితం ఇవ్వడం లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ మూసేయవచ్చు. అలా కాకుండా ఇలా మొత్తానికే సైలెంట్ గా ఉండటం మాత్రం సేఫ్ కాదు. ఎవరో ఒకరు మాట్లాడుతూ సిస్టంని యాక్టివ్ గా ఉంచితే ప్రజల్లో కూడా సినిమాల మీద ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ కోణంలో ఎప్పుడు ఆలోచిస్తారో