iDreamPost
iDreamPost
ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన మాటలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని, తెలంగాణా ముఖ్యమంత్రితో పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపినట్టు మీడియా ద్వారా తెలుసుకున్నానని త్వరలో షూటింగులు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అతి తక్కువ గ్యాప్ లోనే నిర్మాత సి కళ్యాణ్ బదులిస్తూ ఎవరి వల్ల పనులు జరుగుతాయో అలా ముందుకు వెళ్లడం తప్ప మరో ఉద్దేశం లేదని, గతంలో టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చెబితే త్వరగా ఫైళ్ళు ముందుకు కదులుతాయని బాలయ్యను అడిగి చేయించుకున్నామని గుర్తు చేశారు .
ఇప్పుడు వచ్చిన విపత్తు నష్ట నివారణ చర్యలు అందరూ స్వచ్చందంగా పాల్గొని చేస్తున్నావే తప్ప ఎవరిని ఆహ్వానించలేదని కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు బాలయ్యకు చెబుతున్నామని అవసరమైతే తాను వస్తానని ఆయనే చెప్పారనే మాట కూడా కళ్యాణ్ చెప్పడం విశేషం. నిజానికి సిసిసి నెలకొల్పిన తర్వాత బాలకృష్ణతో సహా దాదాపు అందరు హీరోలు విరివిగా చందాలు ఇచ్చారు. చిరంజీవి యాక్టివ్ గా కనపడుతున్నారు, పక్కనే నాగార్జున కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. అంతమాత్రాన రానివాళ్లను ఇంకో కోణంలో అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు వీళ్ళలో ఎవరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలా అని దూరం పెట్టారని కాదుగా అర్థం. సెలెబ్రిటీలు అందరూ బయటికి వస్తే సంకేతాలు ఇంకోరకంగా వెళ్తాయి. అందుకే దీన్ని కొందరికే పరిమితం చేయడం జరిగింది. ఇవాళ బాలకృష్ణ చెప్పినదాంట్లో కూడా మీడియా పెడర్థాలు తీస్తోంది తప్ప నిజానికి ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగా అన్నట్టు కాదని కళ్యాణ్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్ లో బాలయ్య మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు తీస్తున్నారు. మరోవైపు ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసరాల కిట్ల పంపిణి నిర్వహించారు. అది ఒక పక్క జరుగుతుండగానే బాలయ్య కామెంట్స్ వైరల్ అయ్యాయి