iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ! ఈసారి అంతకు మించి..

  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ! ఈసారి అంతకు మించి..

తాప్సీ.. టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత తన మకాంను బాలీవుడ్ కు మార్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ.. వాటికి కేరాఫ్ అడ్రస్ గా మారింది తాప్సీ. కాగా.. గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ వస్తోంది సొట్టబుగ్గల సుందరి. సందర్భాన్ని బట్టి ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది తాప్సీ. తాజాగా మరోసారి చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసారి స్టార్స్ ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమకు అలాంటి పద్దతి మంచిది కాదని హెచ్చరించింది తాప్సీ.

బాలీవుడ్ కు మకాం మర్చిన తర్వాత నిర్మాతగా మారింది స్టార్ హీరోయిన్ తాప్సీ. ఓవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో నిర్మించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘వీక్ ధక్’. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. కాగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “ప్రస్తుతం ఇండస్ట్రీ మెుత్తం స్టార్ల చుట్టూనే తిరుగుతోంది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే గుర్తింపు ఉంది. ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి కూడా పాకింది. దీంతో స్టార్స్ లేని సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారు అయ్యింది. స్టార్లు లేని సినిమాలను ఓటీటీల్లోకి నెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి సంప్రదాయం ఇండస్ట్రీకి మంచిది కాదు” అంటూ తన అభిప్రాయాన్ని కాస్త గట్టిగానే వ్యక్త పరిచింది. పెద్ద చిత్రాలు, చిన్న చిత్రాలను తొక్కిపడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది తాప్సీ. మరి తాప్సీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş