iDreamPost
iDreamPost
సినీ ఇండస్ట్రీలో ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ మధ్య జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. షూటింగ్ లు మళ్ళీ ప్రారంభించేందుకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కొందరు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశంపై బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. రియల్ ఎస్టేట్ చేసుకుని భూములు పంచుకునేందుకే మీటింగులు పెట్టారంటూ బాలయ్య మండిపడ్డాడు. మంత్రితో జరిగిన సమావేశంలో తనను పిలవలేదన్న అక్కసే బాలకృష్ణ మాటల్లో బాగా కనబడింది.
సీన్ కట్ చేస్తే తొందరపడి నోరుపారేసుకున్న ఫలితంగా ఇపుడు బాలకృష్ణ ఇరుక్కుపోయాడని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు మూడు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చిరంజీవి అపాయిట్మెంట్ తీసుకున్నాడట. హైదరాబాద్ నుండి కొందరు సినీ ప్రముఖులు అమరావతికి చేరుకుంటున్నారు. జగన్ ను కలవటానికి రమ్మంటూ చిరంజీవి ఆహ్వానించిన వారిలో బాలకృష్ణ ఉన్నాడని సమాచారం. మరి బాలయ్య అమరావతికి వస్తాడా ? రాడా ? అన్నదే ఇపుడు ఆసక్తిని రేపుతోంది.
బాలకృష్ణ విషయంలో ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిదేమో చిరంజీవి బృందంలో బాలయ్య కూడా వెళితే అందరిలో ఒకడికి ఉండిపోవాల్సుంటుంది. అంటే బాలయ్యకు ప్రత్యేక మర్యాదలేవీ ఉండవు. పైగా బాలయ్య అంటే సినీ హీరో మాత్రమే కాదు. టిడిపి తరపున హిందుపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్ఏ కూడా. కాబట్టి అందరితోపాటు వెళ్ళి తన ప్రత్యేకతను చాటుకోవాలంటే అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం షో చిరంజీవి ఆధ్వర్యంలోనే జరుగుతుంది.
ఇక రెండో సమస్య ఏమిటంటే సమావేశానికి పిలవనందుకే తలసానితో జరిగిన మీటింగ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మరి జగన్ తో జరగబోయే భేటికి గైర్హాజరైతే పరిస్ధితేమిటి ? అంటే పిలవకపోతే నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు, రమ్మని ఆహ్వనిస్తే మాత్రం రాడు అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సుంటుంది. కాబట్టి బాలయ్య పరిస్ధితి ముందు నొయ్యి వెనక గొయ్యి లాగ తయారైంది. మరి జగన్ తో సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారో చూద్దాం.