కొన్ని రీమేకుల ముచ్చట్లు విచిత్రంగా ఆసక్తికరంగా ఉంటాయి. పక్క భాషలో ఆడేసింది కదాని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే మన ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. అలాంటి ఒక ముచ్చట చూద్దాం. 1996లో కార్తీక్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ‘ఉల్లతయ్ అల్లితా’ వచ్చింది. శిర్పి సంగీతం అందించగా రంభ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది కూడా ఒరిజినల్ కథ కాదు. 1968లో రిలీజైన ‘బొమ్మలాట్టం’ నుంచి మెయిన్ లైన్ తీసుకుని అంతకు ముందు 1958లో విడుదలైన ‘శభాష్ […]
ఆల్ ఇండియా మెగాస్టార్ గా పిలివబడే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం లేదా దర్శకత్వం వహించే ఛాన్స్ కన్నా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది. అందుకే తన ముప్పై ఏళ్ళ సినిమా కెరీర్ తర్వాత చిరంజీవి ఏరికోరి మరీ సైరా రూపంలో ఆ ముచ్ఛట తీర్చుకున్నారు. నాగార్జునకు ఖుదాగవా రూపంలో తీరింది కానీ బాలకృష్ణ, వెంకటేష్ లకు మాత్రం ఇంకా ఆ ఛాన్స్ దక్కలేదు. నటి సౌందర్యకు ఆ అదృష్టం 1999లో దొరికింది. […]
మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, […]
బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించడంలో మాస్ సినిమాలదే రాజ్యం అనుకుంటాం కాని సరైన రీతిలో తీసి ప్రేక్షకులను నవ్విస్తే కామెడీ మూవీస్ తోనూ కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుల్లో జంధ్యాల గారిది అగ్ర స్థానం అయితే ఆ తర్వాత పేర్లలో ఈవివి సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి. ఆయన డెబ్యు చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా నిరాశ చెందకుండా ప్రేమ ఖైది అనే చిన్న సినిమాతో స్టార్లు లేకుండా లవ్ స్టొరీ తీసుకుని బ్లాక్ బస్టర్ […]
ఏదైనా సినిమా చూస్తున్నంతసేపు చక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తున్నట్టు అనిపించిందంటే అందులో నిఖార్సైన కామెడీ ఉన్నట్టు. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిక్కులుంటాయి. అభిమానులను సంతృప్తి పరచటం అందులో ప్రధానమైనది. అలాంటిది వాళ్ళతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనుకోవడం కత్తి మీద సామే. దర్శక దిగ్గజం, రచయిత జంధ్యాల గారు మెగాస్టార్ చిరంజీవి తో ఓ కామెడీ నవల ఆధారంగా చంటబ్బాయి తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు కాని ఆ రోజుల్లో […]
ఈవీవీ సత్యనారాయణ గారు తీసిన చాలా బాగుంది సినిమా ద్వారా ఆర్టిస్టుగా తన టాలెంట్ ని పరిశ్రమకు రుచి చూపించి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా కొన్నేళ్ల పాటు బిజీ అయిపోయిన ఎల్బి శ్రీరామ్ గారి గురించి తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. అంతగా గొప్పగా ఆయన జనం మనసులో నాటుకుపోయారు. కామెడీ రోల్ అయినా ఎమోషన్స్ నిండిన సీరియస్ పాత్రైనా ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం తెరమీద కనిపించడం తగ్గినప్పటికీ తన స్వంత యుట్యూబ్ ఛానల్ […]
హాస్య చిత్రాల్లో జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో ఈవివి గారిది మొదటి వరస. ఆయన శిష్యుడిగా జంధ్యాల గారి బాటలోనే నడుస్తూ చిన్న హీరోలతో మొదలుకుని స్టార్ల దాకా ఎన్నో గొప్ప హిట్స్ అందించిన ఘనత ఈవివిది. సాధారణంగా కామెడీ సినిమాలలో పాటలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. వీటి విషయంలో మ్యూజికల్ హిట్ అని వినడమే అరుదుగా ఉంటుంది. కాని ఈవివి ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చారు. ముఖ్యంగా […]