ఆ మధ్య టెలికాస్ట్ అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎపిసోడ్ మీద దాని ప్రసారానికి ముందు అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ షో చరిత్రలోనే హయ్యెస్ట్ రేటింగ్స్ రావొచ్చనే ధీమా అభిమానుల్లో కనిపించింది. కానీ దానికి భిన్నంగా కేవలం 4.9 రేటింగ్ మాత్రమే తెచ్చుకుని చిన్న పాటి షాక్ ఇచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్ రెండూ కలుపుకుని యావరేజ్ చేస్తే ఇది 3.12 దగ్గరే ఆగిపోతుంది. గతంలో […]
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలై ఇప్పుడు చివరి దశకు వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరుడులో తొలి విజేత నమోదయ్యారు. అక్షరాలా కోటి రూపాయలు గెలిచిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర గెలుపు బావుటా ఎగురవేసినట్టు సమాచారం. దీని తాలూకు ఎపిసోడ్లు ఈ వారంలోనే ప్రసారం కాబోతున్నాయి. ఈ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. కోటి రూపాయల ప్రశ్నను గతంలో ముగ్గురు ఎదురుకున్నారు. […]
భారీ అంచనాలు ఖర్చుతో జరుగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు క్విజ్ షో క్లైమాక్స్ కు వచ్చేసింది. నిన్న సాయంత్రంతో తన చివరి ఎపిసోడ్ షూట్ ని జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసినట్టు టీవీ వర్గాల సమాచారం. అధికారికంగా ఇంకా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే నిజమనేలా వినిపిస్తోంది. జెమినీ ఛానల్ ఆశించినట్టు ఈ షోకు కనివిని ఎరుగని రేటింగ్స్ రాలేదు కానీ బిగ్ బాస్ 5 కంటే మెరుగ్గా రావడం ఊరట కలిగించే అంశం. […]
మధ్యలో కొంత డల్ గా సాగుతున్నట్టు అనిపించినా ఫైనల్ గా ఎవరు మీలో కోటీశ్వరులు బాగానే రన్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ మీద ఎలాంటి కంప్లయింట్స్ లేవు కానీ క్విజ్ లకు పెద్దగా ఆదరణ లేని ఈ రోజుల్లో ఇంత మాత్రం టిఆర్పి వస్తోందంటే దానికి తారక్ క్రేజ్ అండ్ స్కిల్స్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. మధ్యమధ్యలో సెలబ్రిటీ గెస్టులను తీసుకొస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల […]
తెలుగు సినిమా హీరోలు అందరూ ఇప్పుడు బుల్లితెర మీద కూడా దృష్టి పెట్టారు.. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి వారు గతంలో కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరించగా ఇప్పుడు నాగార్జున, ఎన్టీఆర్, తమన్నా వంటి వాళ్ళు బుల్లితెర లో తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే తమన్నా మాస్టర్ […]
కరోనా పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు బుల్లితెర మీద కూడా దృష్టి పెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమాలలో నటిస్తున్న ఎన్టీఆర్ లాంటి నటులు కూడా బుల్లితెర షోస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అన్న షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి సోనీ నీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని గతంలోనే నాలుగు […]
నిన్న భారీ అంచనాల మధ్య జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరుడు షో మొదలైపోయింది. మొదటి అతిధిగా రామ్ చరణ్ రావడంతో వ్యూయర్ షిప్ ఎక్కువ వస్తుందనే విశ్లేషణతో ఫస్ట్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా పూర్తి చేశారు. ఆర్ఆర్ఆర్ విడుదల కన్నా ముందు మొదటి సారి ఈ ఇద్దరు కలిసి ఎక్కువ స్పేస్ స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భం ఇదే కావడంతో హీరోల అభిమానులు క్విజ్ పట్ల ఆసక్తి ఉన్నా లేకపోయినా కేవలం వీళ్ళ బాండింగ్ ను […]