iDreamPost
android-app
ios-app

Mahesh Babu In EMK : మహేష్ ఎపిసోడ్ అంతగా వర్కౌట్ కాలేదే

  • Published Dec 16, 2021 | 9:08 AM Updated Updated Dec 16, 2021 | 9:08 AM
Mahesh Babu In EMK : మహేష్ ఎపిసోడ్ అంతగా వర్కౌట్ కాలేదే

ఆ మధ్య టెలికాస్ట్ అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎపిసోడ్ మీద దాని ప్రసారానికి ముందు అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ షో చరిత్రలోనే హయ్యెస్ట్ రేటింగ్స్ రావొచ్చనే ధీమా అభిమానుల్లో కనిపించింది. కానీ దానికి భిన్నంగా కేవలం 4.9 రేటింగ్ మాత్రమే తెచ్చుకుని చిన్న పాటి షాక్ ఇచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్ రెండూ కలుపుకుని యావరేజ్ చేస్తే ఇది 3.12 దగ్గరే ఆగిపోతుంది. గతంలో వచ్చిన రామ్ చరణ్ భాగం ఏకంగా 11.4 రేటింగ్ తో టాప్ లో నిలిచింది. దాన్ని క్రాస్ చేస్తుందేమోనని ఊహించిన వాళ్ళు ఈ స్పందనకు ఆశ్చర్యపోయారు. ఇది జెమిని ఛానల్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు.

ఇలా ఎందుకు జరిగిందని చూస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబుతో ఎపిసోడ్ షూట్ ఎప్పుడో పూర్తి చేశారు. అదిగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చి దాన్ని కాస్తా క్లోజింగ్ సెర్మనీ కిందకు మార్చేశారు. ప్రోమోలు వచ్చినప్పుడు ఆసక్తి చూపించిన ఆడియెన్స్ కు ఇది బాగా లేట్ అవ్వడంతో హైప్ తగ్గిపోయింది. దానికి తోడు గంట మెయిన్ ప్రోగ్రాంకు అదనంగా అరగంట యాడ్స్ వేయడం కూడా వ్యూయర్ షిప్ మీద ప్రభావం చూపించి ఉంటుంది. ఇదే వారంలో వచ్చిన కలర్ ఫోటో ప్రీమియర్ షోకు 6.3, పాగల్ కు 5.2 రేటింగ్ రావడం గమనార్హం. ఈ రెండూ బ్లాక్ బస్టర్లేమీ కాదు. ఫస్ట్ టైం వచ్చాయి కాబట్టి జనం రిసీవ్ చేసుకున్నారు.

అన్ని ఎపిసోడ్లు కలుపుకుని చూసుకుంటే యావరేజ్ గా ఎవరు మీలో కోటీశ్వరుడుకు వచ్చిన రేటింగ్ 5 లోపే. దీన్ని బట్టి క్విజ్ షోల మీద జనం ఏమంత ఆసక్తిగా లేరనేది అర్థమవుతోంది. హిందీలో 1000 ఎపిసోడ్లు దాటినా ఇప్పటికీ అదే ఆదరణతో కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు భుజాలకెత్తుకున్నా సూపర్ హిట్ చేయలేకపోయారు. సెకండ్ సీజన్ ఉంటుందో లేదో ఇంకా జెమిని నుంచి క్లారిటీ లేదు. ఇదింకా నయం. తమన్నాతో ఆర్భాటంగా మొదలుపెట్టిన మాస్టర్ చెఫ్ మరీ వీక్ గా ముగిసిపోయింది. చివరిలో అనసూయను తీసుకొచ్చినా కూడా లాభం లేకపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారో

Also Read : Pushpa : బన్నీ సినిమా ఎన్ని కోట్లు రాబడితే సేఫ్