ఓటిటి మూవీ ఫ్యాన్స్ ఎదురు చూసిన నారప్ప వచ్చేసింది. ప్రేక్షకులకు నచ్చేసింది. అభిమానులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చే వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికైతే కొత్త వాటి రిలీజ్ డేట్ల గురించి క్లారిటీ లేదు కానీ ముందైతే మూడు సినిమాల గురించి విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందులో మొదటిది దృశ్యం 2. డిస్నీ హాట్ స్టార్ ఆల్రెడీ డీల్ లాక్ చేసుకుందని, నిర్మాతల వైపు […]
నిన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశంలో అక్టోబర్ దాకా నిర్మాతలు ఎవరూ డైరెక్ట్ ఓటిటి విడుదలలు చేయకూడదని నిర్మాతలకు విన్నవించడం చర్చకు దారి తీసింది. కాస్త సంయమనం పాటించాలని అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. థియేటర్లు జూలై చివరి వారం నుంచి పూర్తిగా తెరుచుకునే ఆశాభావం కూడా అందులో వ్యక్తం చేశారు. కానీ దీని పట్ల అగ్ర నిర్మాతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. […]
రెండు రోజుల క్రితం నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజవుతాయన్న వార్త విన్నప్పటి నుంచి అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. అయిదారు కోట్లలో రూపొందిన చిన్న సినిమాలే ఆగస్ట్ లో షెడ్యూల్ చేసుకుని థియేటర్ల కోసం ఎదురు చూస్తుంటే నిర్మాత సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ కాలేదు. అలా అని సదరు సంస్థ నుంచి ఖండిస్తూ ప్రకటన కూడా […]
ఇప్పుడీ వార్త నిజమైతే మాత్రం థియేటర్ల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా మారబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క లాక్ డౌన్ తీసేసి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నప్పటికీ ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. థర్డ్ వేవ్ ప్రచారం నేపథ్యంలో అసలు సగం సీట్లయినా నిండుతాయా లేదా అనే అనుమానం వాళ్ళ మెదళ్లను తొలిచివేస్తోంది. అందుకే రెండు నెలలు ఊరికే ఉన్నప్పటికీ నిర్మాతలు మెల్లగా ఒక్కొక్కరుగా ఓటిటిల వైపు అడుగులు వేస్తున్నారు. పెట్టుబడులు గ్యారెంటీగా వెనక్కు రావడానికి ఇదొక్కటే మార్గడం […]
విక్టరీ వెంకటేష్ హీరోగా 2014లో వచ్చిన దృశ్యం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఒరిజినల్ వెర్షన్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేరళలో మొట్టమొదటి సారి 50 కోట్ల వసూళ్లు దాటించిన సినిమాగా ఇది సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. దృశ్యం తర్వాతే మల్లు వుడ్ స్టాండర్డ్ అంతకు రెండింతలు పెరిగింది. వంద కోట్ల దాకా మార్కెట్ ఎక్స్ పాండ్ అయింది. తప్పు చేసిన కుర్రాడిని అనుకోకుండా హత్యచేయాల్సిన […]