iDreamPost
android-app
ios-app

స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న మూవీస్

  • Published Jul 25, 2021 | 7:02 AM Updated Updated Jul 25, 2021 | 7:02 AM
  • Published Jul 25, 2021 | 7:02 AMUpdated Jul 25, 2021 | 7:02 AM
స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న మూవీస్

ఓటిటి మూవీ ఫ్యాన్స్ ఎదురు చూసిన నారప్ప వచ్చేసింది. ప్రేక్షకులకు నచ్చేసింది. అభిమానులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చే వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికైతే కొత్త వాటి రిలీజ్ డేట్ల గురించి క్లారిటీ లేదు కానీ ముందైతే మూడు సినిమాల గురించి విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందులో మొదటిది దృశ్యం 2. డిస్నీ హాట్ స్టార్ ఆల్రెడీ డీల్ లాక్ చేసుకుందని, నిర్మాతల వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వెళ్లిపోయిందని వినికిడి. ఇటీవలి ఇంటర్వ్యూలలో సురేష్ బాబు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదన్నారే తప్ప థియేటర్లలో రావొచ్చు అనేలా మాట్లాడలేదు.

దృశ్యం లాంటి హిట్ మూవీ సీక్వెల్ కాబట్టి వెంకీ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన జీతూ జోసెఫ్ డైరెక్టర్ కావడంతో ఈసారి మరింత న్యాచురల్ గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం లేదా ఆగస్ట్ చివరి వారంలో స్ట్రీమింగ్ ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి. ఇక నితిన్ మాస్ట్రో కూడా ఇదే హాట్ స్టార్ లో ఆగస్ట్ 15 ప్రీమియర్ అవుతుందని అంటున్నారు కానీ యూనిట్ వైపు నుంచి రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇక ఈ లిస్టులోకి లేటెస్ట్ గా ఆకాశవాణి కూడా వచ్చి చేరింది. ఒక డిఫరెంట్ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ మీద భారీ అంచనాలు లేవు కానీ రాజమౌళి ఫ్యామిలీ టీమ్ కాబట్టి హైప్ బాగానే ఉంది. సోనీ లివ్ సంస్థ హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇవి కాకుండా విరాటపర్వం గురించి కూడా ఓటిటి టాక్ వచ్చింది కానీ దర్శకుడు వేణు ఊడుగుల అదేమీ లేదని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు కానీ నిర్మాత వైపు నుంచి స్టేట్ మెంట్ వస్తే తప్ప నమ్మలేం. మొత్తానికి థియేట్రికల్ రిలీజులకు ఫ్యాన్స్ ఉన్నట్టే ఇప్పుడు లేటెస్ట్ గా ఓటిటి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ తయారయ్యింది. కరోనా తెచ్చిన కాలమహిమ ఇది

Also Read: స్టార్ హీరోలకు ఈ వేగం అవసరం

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet