కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాలేదు. ఓ వైపు సౌత్ సినిమాలు రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అంటూ సంచలనాలు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ నటించిన హిందీ సినిమాలు మాత్రం 200-300 కోట్లు వసూలు చేయడానికే అవస్థలు పడుతున్నాయి. చివరిసారిగా 2018లో ‘పద్మావత్’, ‘సంజూ’, ‘టైగర్ జిందా హై’ ఇలా ఒకే ఏడాది మూడు హిందీ సినిమాలు 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. […]
2018లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ షారుఖ్ ఖాన్ తెరమీద కనిపించనే లేదు. దీంతో అభిమానులు మళ్ళీ ఎప్పుడు బాద్షాని చూస్తామా అని కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. వాళ్ళ నిరీక్షణ ఫలించి ఇవాళ పఠాన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తో కెజిఎఫ్ 2 రికార్డుని బద్దలు కొట్టి మొదటి రోజుకు ముందే సంచలనాలు మొదలుపెట్టిన షారుఖ్ ఈసారి హిట్ కోసం దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో చేతులు కలిపాడు. […]
సాహో, రాధే శ్యామ్ లు వరసగా డిజాస్టర్లు అయినప్పటికి ప్రభాస్ ప్యాన్ ఇండియాకు వచ్చిన చిక్కేమి లేదు. కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. అన్నీ వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడినవే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా ఓకే చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. మైత్రి మూవీ మేకర్స్ మొదటిసారి హిందీలో చేయబోతున్న మూవీ ఇదే అవుతుంది. హృతిక్ రోషన్ టైగర్ శ్రోఫ్ లతో వార్ లాంటి గ్రాండియర్ హిట్ […]