iDreamPost
android-app
ios-app

Prabhas ప్రభాస్ కొత్త ప్యాన్ ఇండియా సినిమా

  • Published Jun 07, 2022 | 1:21 PM Updated Updated Jun 07, 2022 | 1:21 PM
  • Published Jun 07, 2022 | 1:21 PMUpdated Jun 07, 2022 | 1:21 PM
Prabhas ప్రభాస్ కొత్త ప్యాన్ ఇండియా సినిమా

సాహో, రాధే శ్యామ్ లు వరసగా డిజాస్టర్లు అయినప్పటికి ప్రభాస్ ప్యాన్ ఇండియాకు వచ్చిన చిక్కేమి లేదు. కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. అన్నీ వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడినవే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా ఓకే చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. మైత్రి మూవీ మేకర్స్ మొదటిసారి హిందీలో చేయబోతున్న మూవీ ఇదే అవుతుంది. హృతిక్ రోషన్ టైగర్ శ్రోఫ్ లతో వార్ లాంటి గ్రాండియర్ హిట్ ఇచ్చిన సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో పఠాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది 2023 జనవరిలో విడుదల కానుంది. హృతిక్ తో ఫైటర్ అనే మరో చిత్రం ఆయన చేతిలో ఉంది. ఈ రెండూ పూర్తవ్వాలి.

వీటి తర్వాత ప్రభాస్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఓ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట సిద్దార్థ్ ఆనంద్. ఎన్ని వందల కోట్లో చెప్పలేదు కానీ ప్రాజెక్ట్ కెని మించి ఉండొచ్చని బాలీవుడ్ టాక్. మొదలు కావడానికి బహుశా 2024 పట్టొచ్చు. అప్పటిదాకా డార్లింగ్ కమిట్ మెంట్స్ అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ముందు సలార్ పూర్తి చేయాలి. మరోవైపు అది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తనకు సంబంధించిన టాకీ పార్ట్ బాలన్స్ అయిపోయింది కాబట్టి ఆ టెన్షన్ లేదు. నాగ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ తో అనిమల్ పూర్తి చేశాక ప్రభాస్ తో స్పిరిట్ మొదలుపెడతాడు.

ఇవన్నీ వచ్చేలోగా రెండేళ్లు అయిపోతాయి. మధ్యలో ప్రభాస్ మారుతీల రాజా డీలక్స్(ప్రచారంలో ఉన్న టైటిల్) ఉంది. సో సిద్దార్థ్ ఆనంద్ చేతిలో బోలెడు టైం ఉంది. ప్రభాస్ స్క్రిప్ట్ ల ఎంపికలో మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. డిఫరెంట్ గా ఉంటుందని లవ్ జానర్ లో రాధే శ్యామ్ చేస్తే నార్త్ ఆడియన్స్ ని సైతం మెప్పించలేకపోయింది. అందుకే ఇకపై కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇంకే సినిమా రిలీజయ్యే ఛాన్స్ లేదు. 2023 సంక్రాంతికి ఆది పురుష్ లేదా సలార్ రెండింటిలో ఒకటి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కానీ చూస్తుంటే అదీ డౌట్ గానే కనిపిస్తోంది,

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet