కరోనాకి విరుగుడుగా అనేక దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టి వారి ప్రజలందరూ తప్పనిసరిగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా చెప్పారు. ఇప్పటికే చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా వేయించుకోవాలని కేంద్రం ప్రజలని కోరుతోంది. దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో […]
సరిగ్గా మూడు నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసానికే పరిమితం అయ్యారు. కరోనా కారణంగా దాదాపు ఏడాది వరకు ఆయన తన పార్టీని జూమ్ యాప్ ద్వారా నడిపించారు. కానీ ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. దానికి కారణం ఏమిటి..? వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే చంద్రబాబు బయటకు వస్తున్నారా..? ఇంతకూ చంద్రబాబు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు..? అనే చర్చ కొనసాగుతోంది. తిరుపతి […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రానుందా..? నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోందా..? అంటే సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. ‘‘కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇందుకు పరిష్కారం కోవిడ్ వ్యాక్సిన్ వేయడమే. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి అంతా […]
దాదాపు ఆరు నెలలుగా ఊరిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెలలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందకు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసే ముందుగా లోటుపాట్లను సవరించుకునేందుకు నిర్వహించే డ్రైరన్ (డమ్మీ వ్యాక్సినేషన్)ను ఈ రోజు దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలో ఈ రోజు, రేపు ఈ డ్రైరన్ కొనసాగనుంది. ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీలో కృష్ణా జిల్లాలో డమ్మీ […]
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ అతి త్వరలోనే మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నట్లుగా ప్రభుత్వాల కదలికలను బట్టి అర్థమవుతోంది. వ్యాక్సిన్ పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ – 19 వ్యాక్సిన్ కావాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ కోసం కో-విన్ యాప్ తీసుకొచ్చింది. త్వరలోనే టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. […]
అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కవితకు కాదేదీ అనర్హం అన్నాడు వెనకటికొక మహాకవి. ఇప్పుడు మోసగాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నట్టున్నారు. తాము మోసం చేసేందుకు మోసపోయేవాళ్ళు ఉంటే చాలన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. సమాచార సాధనాలు విస్తృతమైన నేపథ్యంలో మోసాల విస్తృతి కూడా అంతే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని సామాన్యుల కంటే ముందే మోసగాళ్ళు ఆకళింపు చేసుకుని, తద్వారా మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు సదరు మోసగాళ్ళకు కోవిడ్ టీకా ఒక ఆయుధంగా […]
వ్యాక్సిన్ వచ్చే వరకూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం తప్పనిసరి. సూది మందు వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే అని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వలస కూలీల కోసం రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ఆయన ఉత్తర ప్రదేశ్ లో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్న […]
కరోనా వైరస్ చికిత్స కోసం దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ గ్లెన్‌మార్క్ ఔష«ధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇంజక్షన్ రూపంలో ఉండే ‘రెమిడెసివిర్’ ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి, మార్కెటింగ్ చేసేందుకు అమెరికాకు చెందిన గెలిడ్ సైన్సెస్‌తో దేశీయ ఫార్మ కంపెనీలు హెటిరో, సిప్లాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతులు మంజూరు చేసింది. త్వరలో దేశీయంగా ఈ ఔషధాన్ని హెటిరో, సిప్లా […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాగా కరోనాకి విరుగుడు మందు తన దగ్గర ఉందని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ కరోనా వైరస్‌కు మందు తన దగ్గర ఉందని ప్రకటించారు. గిలోయ్ మరియు అశ్వగంధతో కరోనా వైరస్ కి చికిత్స చేయవచ్చునని వెల్లడించారు.రామ్‌దేవ్ బాబా చేసిన ఈ […]
ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చైనా యాంటీ డోస్ కనుక్కుందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కోతులపై చైనా శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలు నూరు శాతం సక్సెస్ అయ్యిందట. దాంతో మనుషులకు కూడా తొందరలోనే బాధితులకు వ్యాక్సిన్ ఇవ్వటానికి ప్రయత్నాలు రెడీ చేస్తోంది చైనా ప్రభుత్వం. చైనాలోకి ’సినోవ్యాక్ బయోటెక్’ కంపెనీ కరోనా వైరస్ యాంటీ డోస్ ను డెవలప్ చేయటంలో విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే అనేక రకాలుగా […]