iDreamPost
android-app
ios-app

కరోనా వైరస్ కు చైనా వ్యాక్సిన్ కనుక్కుందా ? ప్రయోగాలు సక్సెస్ అయ్యాయా ?

  • Published May 09, 2020 | 5:06 AM Updated Updated May 09, 2020 | 5:06 AM
కరోనా వైరస్ కు చైనా వ్యాక్సిన్ కనుక్కుందా ? ప్రయోగాలు సక్సెస్ అయ్యాయా ?

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చైనా యాంటీ డోస్ కనుక్కుందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కోతులపై చైనా శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలు నూరు శాతం సక్సెస్ అయ్యిందట. దాంతో మనుషులకు కూడా తొందరలోనే బాధితులకు వ్యాక్సిన్ ఇవ్వటానికి ప్రయత్నాలు రెడీ చేస్తోంది చైనా ప్రభుత్వం.

చైనాలోకి ’సినోవ్యాక్ బయోటెక్’ కంపెనీ కరోనా వైరస్ యాంటీ డోస్ ను డెవలప్ చేయటంలో విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే అనేక రకాలుగా ప్రయోగాలు చేసింది. చివరగా మనదేశం నుండి కొన్ని రకాల కోతులను చైనాకు తెప్పించుకున్నది ఈ బయోటెక్ కంపెనీ. కరోనా వైరస్ కట్టడికి తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ’పికో వ్యాక్’ ను శాస్త్రజ్ఞులు కోతులపై ప్రయోగించారు. కోతులను భారత్ నుండి తెప్పించగానే ముందుగా వైరస్ ను ప్రవేశపెట్టారు.

కోతులపై కరోనా వైరస్ ను ప్రయోగించిన వారంలో అవన్నీ వైరస్ దెబ్బకు బాగా ఇబ్బందులు పడ్డాయి. ముఖ్యంగా కోతుల ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. వెంటనే వైరస్ ఉన్న కోతుల్లో కొన్నింటిని ఎంచుకుని యాంటీడోస్ పికో వ్యాక్ ను ఎక్కించారు. ఆశ్చర్యకరంగా ఆ కోతుల్లో వైరస్ ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు విడుదలయ్యాయట. దాని ఫలితంగా కోతుల్లోని ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నాయట. తర్వాత రెండు రోజులకు కోతుల ఊపిరితిత్తులను పరీక్షించినపుడు అసలు కరోనా వైరస్ జాడే కనబడలేదట.

అంటే కోతులపై జరిపిన కరోనా వైరస్ పరీక్షలు విజయవంతమయ్యాయని చైనాలోని శాస్త్రజ్ఞలు ప్రకటించారు. కాబట్టి వైరస్ కు తొందరలోనే యాంటి డోస్ తయారవుతుందని అందరూ ఆశించవచ్చు. ఇదే విధమైన ప్రయోగాలు భారత్ తో పాటు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా డెవలప్ చేస్తున్నారు. చూద్దం పూర్తిస్ధాయి యాంటీ డోస్ ను ఏ దేశం తయారు చేస్తుందో ?