iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: కోవిడ్-19 టీకా సృష్టికర్తపై అవినీతి ఆరోణలు! ఏకంగా ఆ దేశం చర్యలు!

  • Published Apr 30, 2024 | 1:39 PM Updated Updated Apr 30, 2024 | 1:41 PM

Covid Vaccine: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెనికా సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇది తెలిసి జనాలు భయభ్రాంతులకు గురవుతున్న వేళ.. కోవిడ్-19 టీకా సృష్టికర్తపై అవినీతి ఆరోణలు రావడం మరింత సంచనలనంగా మారింది. ఆ వివరాలు...

Covid Vaccine: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెనికా సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇది తెలిసి జనాలు భయభ్రాంతులకు గురవుతున్న వేళ.. కోవిడ్-19 టీకా సృష్టికర్తపై అవినీతి ఆరోణలు రావడం మరింత సంచనలనంగా మారింది. ఆ వివరాలు...

  • Published Apr 30, 2024 | 1:39 PMUpdated Apr 30, 2024 | 1:41 PM
బిగ్ బ్రేకింగ్: కోవిడ్-19 టీకా సృష్టికర్తపై అవినీతి ఆరోణలు! ఏకంగా ఆ దేశం చర్యలు!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదేపిసింది. ఎందరో అమాయకులను బలి తీసుకుంది. లక్షల్లో జనాలు.. కోవిడ్‌ సోకి పిట్టల్లా రాలిపోయారు. కరోనా కారణంగా కోటీశ్వరులు కూడా దిక్కులేని చావు చచ్చారు. అందరూ ఉన్నా అనాథల్లా అంత్యక్రియలు లేకుండా.. సామూహిక దహనాలు నిర్వహించే దౌర్భగ్య స్థితి కల్పించింది ఈ మహమ్మారి. మొదటి వేవ్‌ ప్రపంచం మీద భారీగా ప్రభావం చూపింది. కరోనా కట్టడి కోసం మన దేశం సహా ప్రపంచంలో చాలా దేశాలు నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించాయి. విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌ తప్పనిసరి చేశాయి. ఇక మొదటి వేవ్‌లో మహమ్మారి గురించి పెద్దగా అవగాహన లేకపోవడం.. కట్టడికి సరైన మందులు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల ఆర్థికి స్థితి కుంటుపడింది.

ఈ క్రమంలోనే ప్రపంచంలోని దేశాలన్ని కోవిడ్‌ను నివారించే టీకాను కనుగోనే పనిలో పడ్డాయి. ముందుగా టీకాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో.. సరైన విధివిధానాలు పాటించకుండనే.. టీకాను ఆమోదించి.. జనాలకు వేశారు. దాంతో చాలా మందికి కోవిడ్‌ టీకాల మీద అనుమానం ఉండగా.. తాజాగా తాము తయారుచేసిన కరోనా టీకా కోవిషీల్డ్‌తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా అంగీకరించడం సంచలనంగా మారడమే కాక.. ప్రజల్లో భయాందోళనలు పెంచింది. ఈమధ్య కాలంలో దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కరోనా టీకానే కారణం అనే అనుమానాలుండగా.. ఆస్ట్రాజెనికా ప్రకటనతో వాటికి బలం చేకూరినట్లైంది. మన దేశంలో ఎక్కువశాతం జనాలకు కోవిషీల్డే వేశారు. ఈ టీకా వేసుకున్న వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉండగా.. కోవిడ్‌-19 టీకా సృష్టకర్త మీద బహిష్కరణ విధించారు. ఎందుకంటే..

కోవిడ్‌-19 మొదటి టీకా అభివృద్ధికి నేతృత్వం వహించిన ఓ శాస్త్రవేత్తపై డ్రాగన్‌ కంట్రీ చైనా చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘన, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాస్త్రవేత్త యాంగ్ షావోమింగ్‌పై బహిష్కరణ వేటు వేసింది. అంతేకాక నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసింది. ఇంతకు ఎవరీ యాంగ్‌ అంటే.. చైనా అభివృద్ధి చేసిన తొలి కోవిడ్‌ వ్యాక్సిన్‌ బృందానికి ఈయనే అధ్యక్షత వహించారు. ఇక యాంగ్‌ మీద అవినీతి ఆరోపణలు వెలుగురావడంతో.. చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

చైనాలోని ముఖ్యమైన శాస్త్రవేత్తల్లో ఒకరైన యాంగ్.. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) అనుబంధ విభాగం అయిన చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో.. యాంగ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దేశీయంగా మొదటి కోవిడ్ టీకా బీబీఐబీపీ-కోర్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కరోనా కట్టడి కోసం సాధారణ వినియోగానికి చైనా అనుమతించిన తొలి టీకా ఇదే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంగ్‌పై ఇప్పటికే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్‌పెక్షన్ (సీసీడీఐ) దర్యాప్తు చేపట్టింది.

ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి తొలుత చైనాలోనే వెలుగుచూసిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అయితే, దీనిని ల్యాబ్‌లోనే తయారుచేసినట్టు అమెరికా సహా పలు దేశాలు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపట్టింది. కానీ, ఈ దర్యాప్తునకు తొలినాళ్లలో సహకరించడానికి చైనా నిరాకరించింది. తర్వాత సమ్మతించినా.. పూర్తిస్థాయి సమాచారం మాత్రంనిప్పటి వరకు అందజేయలేదు.