రాజకీయ పార్టీలు అంటే.. ఓట్లు, సీట్లు గెలుచుకోవడమే వాటి అంతిమ లక్ష్యం. ఎన్నికల్లో గెలుపు కోసం కొట్లాటలు, తీవ్ర హింస చోటు చేసుకోవడం, బలగాల కాల్పుల్లో ప్రజలు చనిపోవడం ఇప్పటికీ దేశంలో పలు ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజకీయం ఓట్లు, సీట్లు కోసమే కాదు.. ప్రజల సంక్షేమం కోసమని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలతో పాటు తిరుపతి లోక్సభకు ఉప ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. […]
ఏపీలో ‘లేఖ’ రేకెత్తించిన హీట్ అంతా ఇంతా కాదు. చరిత్రను తిరగేస్తే తప్ప ప్రస్తుత తరాలకు పెద్దగా ఇటువంటి సంఘటనలు గుర్తు కూడా లేదు. కానీ లేఖరాసినాయన, అందుకున్నాయన గమ్మున కూర్చున్నారు. కాకపోతే ప్రతిపక్షం హోదా నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ‘ఆఫ్ఘానిస్థాన్ బ్యాండు మేళం’ వాయించేస్తున్నారు. ఈ మేళానికి ముందు నుంచునే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంకో అడుగుకు ముందుకేసేసి జగన్ తరువాత సీయం ఎవరుంటారు? అని […]